Devineni Uma: పోలవరం ప్రాజెక్టు చూడాలంటే.. అనుమతి కావాలని చెప్పడం సిగ్గుచేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని దౌర్భాగ్య, నిస్సహాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గుచేటు అని ఆరోపించారు. 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా విభజన హామీలను వైసీపీ నేతలు సాధించలేకపోతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరవయ్యారని.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలంటే అనుమతి కావాలని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటు అని అభివర్ణించారు.
Read Also: Amit Shah Meeting With Jr NTR :ఊరికే ఇవ్వరు అపాయింట్‌మెంట్లు
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
టీడీపీ హయాంలో చేసిన డయాఫ్రమ్ వాల్ పనులకు రీయింబర్స్ ఇస్తే దాన్ని లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చుకోవడం బాధాకరమని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అసమర్థతతో లోయర్ కాఫర్ డ్యాం నుంచి ఇసుక రవాణాకు పాల్పడి వైసీపీ నేతలు నాశనం చేశారని ఆరోపించారు. పోలవరం నిర్మాణం చేతకాక చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై బురదజల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, టీడీపీ నాయకులను జైళ్లల్లో పెట్టడం తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన సీఎం జగన్‌కు ఎంత మాత్రం లేదని దేవినేని ఉమ విమర్శలు చేశారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో జగన్ కమిషన్‌లు దండుకున్నారని… రైతుల జీవితాలతో ఆటలాడుకున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!