వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు వరంగల్ పోలీసులు.. లింగగిరి క్రాస్ రేపు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి వైఎస్ షర్మిల సిద్ధం అయ్యారు.. రేపటి నుండి పాదయాత్రను పునఃప్రారంభించేందుకు గాను పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.. అయితే, పాదయాత్ర అనుమతి కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దు..? అంటూ ఆమెకు పోలీసులు షోకాజ్ నోటీసులను అందజేశారు. పాదయాత్రకు మొదటి సారి పోలీసులు అనుమతిని ఇచ్చినప్పుడు.. వారు…
డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర వివరాలను తెలిపారు. పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరామని ఆమె వెల్లడించారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆమె ఆరోపించారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పుడు.. పొత్తుల ప్రస్తావన తెరమీదకి రావడం సాధారణం. తమ పార్టీ బలంగా లేదన్న ఉద్దేశంతోనో, లేక ఒక ప్రత్యర్థిని సెలక్ట్ చేసుకొని అతడ్ని ఓడించాలన్న ప్రణాళికలతోనో పొత్తులు పెట్టుకుంటుంటారు. అందుకే.. ఎన్నికలప్పుడు ప్రతీ పార్టీకి ‘పొత్తు’ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురవ్వగా.. తాను సింగిల్‌గానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ సింగిల్‌గానే పోటీ…
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది.. ప్రస్తుతం హుజారాబాద్ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగుతుండగా.. ఇవాళ బ్రేక్ ఇచ్చిన ఆమె.. పాదయాత్ర స్పాట్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు .. ఇక, రేపు ఇడుపులపాయ వెళ్లనున్న ఆమె.. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఏపీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్మోహర్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు..…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. రైతుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసిందని ఆరోపించిన ఆమె.. విత్తనాలు, ఎరువుల మీద సబ్సీడీలు లేవన్నారు. రైతులను బ్యాంక్‌ల దగ్గర డీ-ఫాల్టర్లుగా మిగిల్చారని.. బ్యాక్ వాళ్ళు రైతుల్ని దొంగలుగా చూస్తున్నారని.. రైతుల ఇళ్లను జప్తు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రశ్నించిన షర్మిల.. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.…
ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు షర్మిల. పాదయాత్రలో 21వ రోజున ఆగిపోయిన గ్రామం నుంచే 22వ రోజు పాదయాత్ర తిరిగి మొదలు కానుంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల పాదయాత్రకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుని… స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం…
వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వైఎస్ షర్మిల తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాల్సి వస్తుందని… ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుసటి రోజే పాదయాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. 21 రోజులు 6 నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో చేసిన పాదయాత్రలో వందల సమస్యలు చూశామని… పెన్షన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు,పలు రకాల…
తెలంగాణలో గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు, దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం నాడు షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్యామల తన భర్తతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ… సమాజంలో మార్పు…