వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది.. ప్రస్తుతం హుజారాబాద్ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగుతుండగా.. ఇవాళ బ్రేక్ ఇచ్చిన ఆమె.. పాదయాత్ర స్పాట్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు .. ఇక, రేపు ఇడుపులపాయ వెళ్లనున్న ఆమె.. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఏపీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్మోహర్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.. ఇక, మళ్లీ పాదయాత్ర కొనసాగించనున్నారు. అంటే.. ఈ నెల 10వ తేదీ నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది..
Read Also: Rohit Sharma: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో ప్రపంచకప్ టీమ్ కొలిక్కి..!!
ఇక, తన ప్రజాప్రస్థానం పాదయాత్రలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ షర్మిల.. మీరు తెలంగాణ పోలీసులా? టీఆర్ఎస్ పోలీసులా? ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా? టీఆర్ఎస్ కు కొమ్ముకాస్తున్నరా? మాపై దాడి చేసిన వారిని దగ్గరుండి తప్పిస్తారా? మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మా పార్టీని ఏం చేయలేరు. అంతిమ విజయం మాదే అవుతుంది అని ఇవాళ పోలీసుల తీరుపై మండిపడ్డారు షర్మిల.. మాట–ముచ్చట పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆమె.. ప్రజలు వినిపించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. సమస్యలు లేని, సంక్షేమ తెలంగాణను సాధిస్తాం అన్నారు.. మరోవైపు, కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నాయని బీజేపీ చెప్తున్నా అరెస్టు చేసే సత్తా లేదని ఎద్దేవా చేశారు.. అందుకే సీఎం కేసీఆర్ బరితెగించారు. టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇక్కడి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా మారారు అని ఆరోపించారు. తన పాదయాత్రను ఆపే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు లేదని ప్రకటించారు వైఎస్ షర్మిల.