షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖ యాంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు, దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం నాడు షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్యామల తన భర్తతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ… సమాజంలో మార్పు తెచ్చేందుకు షర్మిల చేపట్టిన పాదయాత్రలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
Read Also: తెలంగాణ లో మరో కొత్త పార్టీ
Also Read
తాను మొదటి నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానిని అని యాంకర్ శ్యామల వెల్లడించారు. అందుకే షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. గత 8 రోజులుగా తన అక్క షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని.. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అక్కతో చెప్పడం తాను స్వయంగా చూశానన్నారు. ఒకవైపు మహానేత కుమార్తె, మరోవైపు సీఎంకు సోదరి అయిన అక్క షర్మిల సంతోషంగా జీవించొచ్చని.. కానీ ఆమె తన నాన్నగారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు కొనసాగుతుండటం చాలా గొప్ప విషయమని యాంకర్ శ్యామలా అభిప్రాయపడ్డారు. కాగా వైఎస్ఆర్ తన పాదయాత్ర చేపట్టిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..