Kakani Govardhan Reddy: అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు.. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.. గత ప్రభుత్వంలో ఎకరాకు లక్ష రూపాయలు అదనంగా ఆదాయం వస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ. 40 వేల దాకా రైతులు నష్టపోతున్నారు అని పేర్కొన్నారు.
మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది..
పోటీ చేయాలా, వద్దా అనేది త్వరలో చెబుతాం: తలసాని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇంటింటికీ వెళ్లే పరిస్థితులు లేవని.. హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని వాళ్లే అన్నారు.. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయ్యిందని ఆరోపించారు..
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశం సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్.. సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగు నాగార్జున, వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
Guntur SP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు చేసిన వారిపై కేసులు పెడుతున్నారు అనే వాదనను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తోసిపుచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే విషయంలో నోటీసులు ఇచ్చామే కానీ.. కేసులు పెట్టిన వారికి నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్నీ నిర్ణయాలను ముఖ్య నేతలతో చర్చించి మాజీ సీఎం, వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన పలు పార్టీ అంశాలపై వారు ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, పోలవరం, హామీల అమలు తీరుపై చర్చ జరిపినట్లు తెలుస్తుంది.
YCP Party: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల నోటీసులకు కార్యాలయ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ భద్రతపై పలు అనుమానాలున్నాయి.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర వరుస అగ్నిప్రమాదాలు కలకలం సృష్టించిన విషయం విదితమే కాగా.. అయితే, అగ్నిప్రమాద ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.. కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనదారుల పేర్లు, వారి వాహనం నంబర్ల వివరాలు ఇవ్వాలని సూచించారు.. దీంతో, పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్…
Speaker Ayyanna Patrudu: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.