Vallabhaneni Vamsi Case: విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. అయితే, జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగింది తెలుగుదేశం పార్టీ.. టీడీపీ సీనియర్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఆ సమావేశంలో సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన దృశ్యాలు విడుదల చేశారు.. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు వల్లభనేని వంశీ తీసుకెళ్లారని తెలిపారు టీడీపీ నేతలు.. ఈ నెల 11న హైదరాబాద్ మైహోం బుజాలో వంశీ వెంట సత్యవర్ధన్ ఉన్నారని.. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తి చేయాలనుకుంటే ఊరుకునేదిలేదని వార్నింగ్ ఇచ్చారు.. సత్యవర్ధన్‌ను ఎలా అపహరించారో సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యం అన్నారు.. వంశీతో పాటు అందరి చిట్టాలు బయటికొస్తాయి.. ప్రశాంతమైన కృష్ణాజిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు.
Read Also: Satyendra Jain: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రిపై విచారణకు రాష్ట్రపతి అనుమతి
గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై వైఎస్ జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇక, నేరస్థులకు జగన్ మద్దతిస్తున్నారని ఆరోపించిన ఆయన.. మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని నిలదీశారు.. మీరు చేసిన అరాచకాలన్నీ బయటకొస్తాయి.. పోలీసుల బట్టలు విప్పతీస్తారా? చట్టం ఎవర్నీ వదలదు అని వార్నింగ్ ఇచ్చారు.. మీ బెదిరింపులకు భయపడం.. కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.