వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు చేశారు గుంటూరులో పోలీసులు.. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్‌లో వైఎస్ జగన్ పర్యటించిన విషయం విదితమే కాగా.. ఈ పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు..
గత అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై గట్టిగానే పోస్ట్ మార్టం చేసుకున్న వైసీపీ ఇప్పుడిక దిద్దుబాటు చర్యల్ని ముమ్మరం చేస్తోందట. ఒక్క ఓటమి వంద అనుభవాలు నేర్పుతుందన్నట్లుగా... పార్టీకి ఒక పద్ధతి ప్రకారం టింకరింగ్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 2024లో ప్రధానంగా... ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గం తమకు అండగా లేకపోవడం వల్లే డ్యామేజ్ తీవ్రత పెరిగిందని గుర్తించి ఆ కోణంలో రిపేర్ మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు.
చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. రంగరాజన్‌కు ఫోన్ చేసిన వైఎస్ జగన్.. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమైన విషయం అన్నారు వైఎస్ జగన్..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మరోసారి బయటపడింది. జగన్‌కు జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా.. ఆయనకు పోలీసులు కనీస భద్రత కూడా కల్పించలేదు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో దారిలో ఎక్కడా పోలీసులు పెద్దగా కనబడలేదు. పెద్దగా భద్రత లేకుండానే గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులతో జగన్ సమావేశం అయ్యారు. తన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. తమ హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారిందని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నేడు గుంటూరు మిర్చి యార్డ్‌కు జగన్ వచ్చారు. మిర్చి రైతుల…
వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘నాడు-నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మాజీ సీఎం వైఎస్ జగన్ మార్చారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ పాఠశాలలు అక్కడ వసతులు చూసి ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను పొగిడారన్నారు. సీఎం చంద్రబాబు అంతా ప్రైవేట్ రంగానికి లబ్ది కలిగిస్తారని నేదురుమల్లి మండిపడ్డారు.…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. సౌత్ బైపాస్ వద్ద జగన్‌కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సౌత్ బైపాస్ నుంచి ర్యాలీగా గుంటూరు మిర్చి యార్డ్‌కు వైసీపీ అధినేత చేరుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో మాజీ సీఎం జగన్ మాట్లాడనున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర…
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంట ముందే గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. తాజాగా ఓ గంట ముందే (9 గంటలకు) వెళ్లేలా షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డ్‌కు వద్దకు చేరుకుని.. గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో జగన్…
టీడీపీ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది.. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని.. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ ఆరోపించింది.. కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం.. చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్దన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్మెంట్ ఇచ్చారు..