Ambati Rambabu: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. రేపు గుంటూరులో పర్యటించనున్నారు.. గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్న ఆయన.. రైతులతో మాట్లాడనున్నారు.. మిర్చి పండించడానికి పడిన కష్టాలు.. ప్రస్తుతం మిర్చి అమ్మేందుకు పడుతోన్న బాధలను తెలుసుకోనున్నారు.. వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రేపు గుంటూరు మిర్చి యార్డు లో మాజీ సీఎం జగన్ పర్యటిస్తారు… రేటు లేక అవస్థలు పడుతున్న ,రైతుల గోడు వినడానికి జగన్ వస్తున్నారని తెలిపారు.. ఆసియాలోనే అతి పెద్ద మిర్చి యార్డు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతుంది… యార్డులో, మిర్చి రైతులు దగా పడుతున్నారు.. వరికి, పత్తికి రేటు లేక రైతులు విలవిలలాడి పోతున్నారు.. గతంలో తొమ్మిది వేలు పలికిన పత్తి ఇప్పుడు నాలుగు వేలకు కొనేవాడు లేడు.. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు దగ్గర ధాన్యాన్ని, కొనుగోలు చేశాం… రైతాంగానికి భరోసా ఇచ్చాం.. ఇప్పుడు మిర్చి పరిస్థితి ,మిర్చి రైతు పరిస్థితి దారుణంగా ఉందన్నారు..
Read Also: Thummala Nageswara Rao: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. పంటల రక్షణ కోసం కొత్త స్కీం..!
ఇప్పుడు తేజ రకం మిర్చి రూ. 12 వేలు పలుకుతుంది.. వైసీపీ ప్రభుత్వంలో ఇదే రకం మిర్చి 23 వేల రూపాయలు పలికిందన్నారు అంబటి.. మిర్చి రైతుల కష్టం పై ప్రభుత్వం నుండి సుయ్ లేదు, సయ్ లేదు… అందుకే రైతులను ఓదార్చేందుకు, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు తెలిపేందుకు మాజీ సీఎం జగన్ వస్తున్నారు… రైతుల గోడు జగన్ విన్నాక , పరామర్శించిన తర్వాత ఈ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం అన్నారు.. ఇప్పటి వరకు ప్రభుత్వానికి టైం ఇచ్చాం.. ఇకపై రైతుల పక్షాన పోరాడతాం.. రైతుల తరపున వకాల్తా పుచ్చుకుంటాం అన్నారు.. మరోవైపు, మిర్చి రైతుల పరామర్శకు ఎన్నికల కోడ్ కి సంబంధం లేదన్నారు అంబటి.. మేం పబ్లిక్ మీటింగ్ లు పెట్టడం లేదు.. రైతుల సమస్య మాత్రమే వింటాం.. రైతులకు అండగా ఉంటాం అన్నారు.. ఇక, చంద్రబాబు కి వయసు వచ్చింది కానీ సిగ్గు రాలేదు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. సంపద ఎలా సృష్టించాలో చంద్రబాబు కి తెలియదట… జగన్ వస్తున్నారు అని తెలియగానే సీఎంలో కదలిక వచ్చినట్లు ఉంది.. అర్జంట్ గా , రైతుల సమస్య గుర్తుకు వచ్చింది.. సమీక్షలు పెడుతున్నారు.. జగన్ వచ్చి వెళ్లాక ఐయినా రైతులకు మంచి చేస్తే మంచిదే అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..