రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్లో పరామర్శించిన జగన్.. ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు దూకుడుగా వ్యవహరించారని, కొన్ని సందర్భాల్లో తమ విషయంలో పరిధి దాటి కూడా ప్రవర్తించారన్నది టీడీపీ నేతల అభిప్రాయం. కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ అప్పట్లో మంత్రులుగా పనిచేశారు. వీరిలో కొడాలి, జోగి, వల్లభనేని వంశీ ఇద్దరూ చంద్రబాబు, లోకేష్లపై మాటల దాడి చేస్తే... పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఎక్కువ…
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్కు నా హామీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్టపడి బటన్ నొక్కి అన్ని హామీలు అమలు చేసినా.. మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఓడించారో తెలపాలి అంటూ వైఎస్ జగన్ను నిలదీశారు..
Kakani Govardhan Reddy: అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు.. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.. గత ప్రభుత్వంలో ఎకరాకు లక్ష రూపాయలు అదనంగా ఆదాయం వస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ. 40 వేల దాకా రైతులు నష్టపోతున్నారు అని పేర్కొన్నారు.
మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది..
పోటీ చేయాలా, వద్దా అనేది త్వరలో చెబుతాం: తలసాని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇంటింటికీ వెళ్లే పరిస్థితులు లేవని.. హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని వాళ్లే అన్నారు.. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయ్యిందని ఆరోపించారు..
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశం సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్.. సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగు నాగార్జున, వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
Guntur SP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు చేసిన వారిపై కేసులు పెడుతున్నారు అనే వాదనను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తోసిపుచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే విషయంలో నోటీసులు ఇచ్చామే కానీ.. కేసులు పెట్టిన వారికి నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్నీ నిర్ణయాలను ముఖ్య నేతలతో చర్చించి మాజీ సీఎం, వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన పలు పార్టీ అంశాలపై వారు ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, పోలవరం, హామీల అమలు తీరుపై చర్చ జరిపినట్లు తెలుస్తుంది.