YS Jagan: నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (ఫిబ్రవరి 6) మీడియా ముందుకు రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఆయ మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబును నియమించారు. సీఐడీ డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుందని తెలిపారు.. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్న ఆయన.. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలపెడతా.. అక్రమ కేసులు పెట్టిన వారిపై…
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు.. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు..
కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీరు ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ... ఇప్పుడు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకే పరిమితమైంది. ఆలూరులో విరూపాక్షి, మంత్రాలయం నుంచి బాలనాగి రెడ్డి మాత్రమే గెలిచారు.
పెద్దిరెడ్డికే కాదు జగన్ వాళ్ళు నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు అని నాగబాబు అన్నారు. పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఎవరు అయితే మాకెంటీ.. రాయలసీమలో 23 వేల ఎకరాలు దోచుకున్నారు.. తన అనుచరులతో పెద్దిరెడ్డి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్దం చేయించాడని ఆరోపించాడు.
విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు.. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు..
రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి వైసీపీ విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాల నేపథ్యంలో విప్ జారీ చేసింది.. విప్ ధిక్కరిస్తే ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయనుంది. రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి.. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.
పార్టీ పదవులు పొందిన కార్యకర్తలందరికీ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.. పదవులు పొందిన వారందరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉంటాయని.. వాటన్నింటినీ పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కరోనా సమయంలో ఇచ్చిన హామీలు చేసింది జగన్ మాత్రమే అన్నారు.. ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారన్నారు. ఎంఏ ఎకనామిక్స్, ఆర్థిక నిపుణుడు అయినా చంద్రబాబు ఇవన్నీ…