ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీకి, ఢిల్లీకి దగ్గరి పోలికలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. లిక్కర్ పేరుతో సిస్టమ్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, ఢిల్లీలో జరిగిన స్కాం చాలా చిన్నది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు, పాపిష్టి డబ్బు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ నేతలు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారట. నియోజకవర్గ ఇంఛార్జ్‌లుగా ఉన్న నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ, మండల, జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయటంపై ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. త్వరలో జిల్లా పర్యటనలు చేస్తానని స్వయంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పటంతో పార్టీ అధిష్టానం పార్టీ పదవులను భర్తీ చేయటంపై ఫోకస్ పెట్టింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో మూడు రాజధానులే మా విధానం అని స్పష్టం చేసింది.. అమరావతిని శాసన రాజధానిని చేసి.. విశాఖను పరిపాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొన్నారు.. ఆ దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది.. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటి? నే చర్చ సాగుతుండగా.. మూడు రాజధానులపై మా స్టాండ్ ఏంటో త్వరలో చెప్తాం అన్నారు…
విధ్వంసకారుడే విధ్వంసం గురించి, విధ్వంసానికి నిర్వచనం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
Mopidevi Venkataramana: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు, ఎన్నెన్నో ఒడి దుడుగులు ఎదుర్కొన్నాను అని తెలిపారు.
Minister Sandhya Rani: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడింది. పిచ్చి జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ గా మారటమే జగన్ 2.0 అని పేర్కొంది. శవం లెగిస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్.. విజయమ్మ, షర్మిలా ఆయుష్షు గట్టిది కాబట్టే అతడికి దూరంగా ఉంటున్నారు.
Sailajanath Joins YSRCP: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైసీపీలో చేరానని సీనియర్ రాజకీయ నేత సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని అన్నారు.
Vijayasai Reddy: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా.. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు సాకే శైలజానాథ్. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రశ్నకే.... ప్రశ్నలు ఎదురవుతున్నాయా? నిలదీస్తానన్న స్వరానికే నిలదీతలు పెరుగుతున్నాయా? ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను వైసీపీ నేతలు అడుగుతున్న తీరు చూస్తుంటే... ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగినా... తేడాగా ఏం చేసినా... ప్రశ్నిస్తా, నిలదీస్తానని గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చారు పవన్.