వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. సౌత్ బైపాస్ వద్ద జగన్‌కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సౌత్ బైపాస్ నుంచి ర్యాలీగా గుంటూరు మిర్చి యార్డ్‌కు వైసీపీ అధినేత చేరుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో మాజీ సీఎం జగన్ మాట్లాడనున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు.
ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మిర్చి రైతులకు వైఎస్ జగన్ మద్దతుగా నిలవనున్నారు. జగన్ రాక నేపథ్యంలో మిర్చి యార్డ్‌కు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నేతలు వచ్చారు. మిర్చి యార్డ్ వద్ద జగన్‌ను కలిసి మాట్లాడారు. అయితే జగన్ పర్యటనకు ఈసీ అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఇది సభ, ర్యాలీ కాదని.. రైతులతోనే జగన్ మాట్లాడుతారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.