YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల కూల్చివేతలు, హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అని జగన్ ప్రశ్నించారు.
Read Also: L2: Empuraan Review: L2: ఎంపురాన్ రివ్యూ
ఇక, అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేతతో పాటు వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది అని మాజీ సీఎం జగన్ తెలిపారు. కానీ, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా?.. ఈ అంశంపై అప్పటి కేంద్ర మంత్రికి నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్ర పరిధిలో ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని కోరాను.. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు.. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది అని జగన్ తెలిపారు.
Read Also: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు!
మరోవైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది అని వైఎస్ జగన్ ఆరోపించారు. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. అయితే, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన దాడి చేశారని మండిపడ్డారు. ఇక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశీనాయన క్షేత్రంలో గుడి కూల్చివేశారని జగన్ తెలిపారు.