CM Chandrababu: మారకపోతే వాళ్లకే నష్టం.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎమ్మెల్యే లు మారకపోతే వారికే నష్టం.. అంటూ మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో.. ఎమ్మెల్యేలకు కఠినమైన హెచ్చరికలు ఇచ్చారు చంద్రబాబు.. ఎమ్మెల్యేలు మారకపోతే వారికి నష్టం మాత్రమే వస్తుందని, తన వ్యక్తిగత విధానంలో ఎట్టి పరిస్థితుల్లో నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 9 ప్యారామీటర్లలో సర్వే చేయించి, ఫలితాలను సీల్డ్ కవర్‌లో ఎమ్మెల్యేలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక, లోకేష్ తన పని తాను చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నా. నేతలతో సంబంధాలు, మోటివేషన్ భయ-భక్తీ లాగా ఉండాలి. మంగళగిరి చీరలకు మహిళా ఎమ్మెల్యేలు ఒకే రకమైన చీరలు ధరించడం ఐక్యతకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
అమరావతి అభివృద్ధిపై చర్చలో, బిల్ గేట్స్‌ను మూడు సార్లు ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు చంద్రబాబు.. హైటెక్ సిటీ, విశాఖ అగ్రిటెక్ ప్రాజెక్ట్, సంజీవిని పథకం కోసం బిల్ గేట్స్ తరలింపులు నిర్వహించబడినట్లు వివరించారు. ఇక, జూబ్లీహిల్స్‌లోని వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్న ఆయన… 1982లో అక్కడ అడవిలా ఉన్న భూమిలో ఇల్లు నిర్మించడానికి వెళ్లిన అనుభవం, తర్వాత బాలకృష్ణకు ఇల్లు కట్టించి ఇచ్చిన విధానం, నాలుగేళ్లలో పరిసర ప్రాంతాల పరిస్థితులు మారిన ఉదాహరణ ద్వారా అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులు సాధించబడతాయని తెలిపారు.
మరోవైపు.. రాయలసీమ అభివృద్ధి గురించి చెబుతూ.. హార్టీకల్చర్ హబ్‌కు 30,000 కోట్లు కేటాయించడం ఎమ్మెల్యేలకు సంతోషకరం అన్నారు చంద్రబాబు… పూర్వం నీరు, పశు ఫీడ్ రాయలసీమకు అందకపోవడం, రైన్ గన్స్ ఉపయోగించడం వంటి సమస్యలు పరిష్కరించబడ్డాయని, ఇప్పుడు దేశంలో ఉత్తమ పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, దానిమ్మకు బాగా డిమాండ్ ఉందని వివరించారు. మొత్తం మీద, చంద్రబాబు ఎమ్మెల్యేలకు నిక్కచ్చిత్వం, భయభక్తి మరియు సమర్ధతతో పని చేయాలనే సందేశాన్ని స్పష్టంగా ఇచ్చారు, అలాగే అమరావతి, రాయలసీమ అభివృద్ధి విజయాలను ప్రజలకు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!