దేశంలో ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ధనవంతుడైన బీజేపీ ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్లు ఉన్నాయని.. అత్యంత పేద బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు కేవలం రూ.1,700లే అని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ విశ్లేషణ చేసి నివేదిక విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. అయితే, గతంలో కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. నేటి కేబినెట్ లో వైఎస్ఆర్ పేరుకు అదనంగా కడప పేరును చేరుస్తూ తీర్మానం చేశారు..
పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విఫలం అయ్యారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో త్రాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలని.. మాజీ సీఎంగా పులివెందుల సమస్యలను అర్జిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారన్నారు. వేంపల్లి పంచాయితీలో పని చేసిన ఈఓలు బాధ్యత రహితంగా వ్యవహరించారని, జగన్ మోహన్ రెడ్డి సమీప…
ఏపీలో కక్షలు, కార్పణ్యాలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన దశలో.. ఏపీ పక్కదోవ పడుతున్నట్టు స్పష్టం కనిపిస్తోంది. గతంలో జగన్ ప్రతీకార రాజకీయాలు చేసి పొరపాటు చేశారు. ఇప్పుడు కూటమి సర్కారు కూడా ప్రతీకారం విషయంలో జగన్ బాటే పట్టడంతో.. ఏపీ భవిష్యత్తు ఏంటా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్.. విజయసాయిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించిన ఆయన.. మొన్నటి వరకు సాయిరెడ్డి చెప్పిన పూజారుల్లో ఆయన ఒకరు కదా...? అని ప్రశ్నించారు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది... జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి..
YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడుకు చెందిన పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ కలిశారు.
Nimmala Rama Naidu: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్ట్ కు నేటికి రూ. 5052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా రావడం జరిగింది అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Minister Satya Kumar: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు.
Vijayasai Reddy: వైసీపీకి రాజీనామా చేయటంపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉంది.. దాని వల్లే నేను జగన్ కు దూరం అయ్యాను.. ఆయన మనసులో నాకు స్థానం లేదు అని తెలిసింది.. ఆ విషయం తెలిసి నా మనసు విరిగింది.. అందుకే పార్టీ నుంచి వెళ్లి పోతున్నాను అని నేను జగన్ కు చెప్పాను.
‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.…