కన్నుమూసి తెరిచే లోపు ఏడాది గడిచిందని.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని.. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందన్నారు. వైసీపీ ఏదైనా చెప్పిందంటే.. తప్పకుండా చేస్తుందన్న నమ్మకం జనాల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజల గొంతుకగా పోరాడుతుంది…
రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైసీపీ సిద్ధమైంది. ‘యువత పోరు’ పేరుతో ధర్నా కార్యక్రమంను నేడు వైసీపీ చేపట్టనుంది. ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు నాయకులు, కార్యకర్తలు చేయనున్నారు. అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. అంతేకాదు ధర్నాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువతతో కలిసి వైసీపీ పోరుబాకు సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ…
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదు.. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలన్నారు.
Sajjala Ramakrishna Reddy: ఈ నెల 12న చేపట్టిన 'యువత పోరు' ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ఇక, అదే రోజు వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి సూచించారు..
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం వినిపించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ప్రభుత్వంలో 650 కోట్ల రూపాయలతో సలహాదారులు నియమించుకున్నారు.. అంత మంది సలహాదారులను నియమించుకుని కనీసం జల్జీవన్ మిషన్ లో రాష్ట్రానికి వచ్చిన ఫండ్ ఉపయోగించుకోలేకపోయారు అంటూ దుయ్యబట్టారు..
చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించడం జగన్కు అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు.. ఇప్పుడు, బెంగళూరులో ఉంటూ ఇక్కడి ఎన్నికల గురించి మాట్లాడితే ఎలా అని అడిగారు.
నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పారని, ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రతి మహిళకు సీఎం చంద్రబాబు నాయుడు రూ.36 వేల బాకీ ఉన్నారన్నారు. మహిళలు ఉచిత బస్సు చాలా చిన్న హామీ అని, అది కూడా ఇంతవరకు అమలు చేయలేదని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తల్లికి వందనం అన్నారు.. రూపాయి కూడా ఇంతవరకు…
గవర్నర్ ప్రసంగం, బడ్జెట్పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.…