ఏపీ సర్కార్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 3 ఏళ్లుగా కాన్వాయ్ డబ్బులు ప్రభుత్వం బాకీ పడడం రాష్ట్రానికి అవమానమన్న ఆయన.. కాన్వాయ్ కోసం కార్లు పెట్టిన వారికి ప్రభుత్వం రూ. 17 కోట్ల బాకీ పడడం సిగ్గుచేటన్నారు.. వ్యవస్థల పతనానికి ఇది నిదర్శనం.. ఆందోళనకరం అన్నారు. పాలకుల వైఫల్యం అధికారులను, ఉద్యోగులను కూడా ఒత్తిడిలోకి నెట్టేస్తుందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. సీఎం కాన్వాయికు కార్లు పెట్టిన…
సింహం సింగిల్‌గానే వస్తుంది.. మళ్లీ జగనే సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో బలమైన ప్రభుత్వం ఉంది… ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. పొత్తులు పొత్తులు అని మాట్లాడుతున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు బట్టలు చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తులు అంటున్నాయి.. సింహం సింగిల్ గానే…
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఏపీ పుననిర్మాణం జరిగిందని తెలిపారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఆ తర్వాతే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగుల వేస్తుందన్నారు.. కానీ, జగన్ పాలనా వల్ల రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. అయితే, ప్రస్తుతం సీట్లు గురించి చర్చే అవసరం లేదు.. ముందు జగన్ పరిపాలనకు చమరగీతం పాడాలన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిక సీఎం జగన్ ఏపీని వ్యాపారం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. Read Also: Sarkaru Vaari Paata:…
ఓట్లు చీలకూడదు.. జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు తెలిపారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్… పవన్ కళ్యాణ్ సభకు వెళ్లొద్దని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించిన ఆయన.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 1,019 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. రైతులను ఆదుకుంటూ పర్యటనలు చేస్తున్న పవన్ కల్యాణ్‌ను రాజకీయ కోణంలో చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నాయని పవన కల్యాణ్ రైతుల కోసం రావడం లేదు.. భరోసా ఇచ్చేందుకు వస్తున్నారన్న…
రేపల్లె అత్యాచార ఘటన అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య అగ్గి రాజేసింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సైతం వారి వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపక్షంపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. Read Also: Minister Gudivada Amarnath: చంద్రబాబు ఇరుక్కోవడం ఖాయం! పేద ప్రజల కోసం సీఎం…
2024 ఎన్నికలే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో పార్టీ పైనే ప్రధానంగా దృష్టి సారించాలని జగన్ సూచించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ట పరచడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. గడప గడపకు వైసీపీ సర్వే చేస్తుందన్నారు. సర్వేలో రిజల్ట్ బాగా వచ్చినోళ్లకే సీట్లు అని స్పష్టం…
నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. దీంతో.. నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.. కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో…