తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఉత్తరా౦ధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న.. రాష్ట్ర ప్రజలంతా ‘జే’ టాక్స్ కడుతుంటే… విశాఖ ప్రజలు ‘వీజే’ టాక్స్ కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారన్న ఆయన.. సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ప్రజాదర్బార్ పెడితే ఆయనకి తెలిసినవి, తెలియకుండా విజయసాయి రెడ్డి…
పెగాసెస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ విక్రయించడానికి బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు డిమాండ్ చేశారని…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతీ ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవటం పవన్ కళ్యాణ్‌కు అలవాటు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్కో ఎన్నికల్లో పవన్ ఒక్కొక్కరిని తిడుతూ మాట్లాడుతారని విమర్శించిన ఆయన.. అప్పుడు తిట్టి ఇప్పుడు మళ్లీ తిరిగి చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమవుతున్నారని.. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా పేదలకు ప్రభుత్వం…
కుల మతాలకతీతంగా సాంప్రదాయాలను పాటిస్తూ చేసుకునే పండగ హోలీ.. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురు చూసే వారు చాలా మందే ఉంటారు. కానీ గత రెండేళ్లుగా ప్రజలు కోవిడ్ కారణంగా హోలీ జరుపుకోలేదు. ఈసారి పరిస్థితి మారింది. రంగులతో వీధులన్నీ సందడిగా మారాయి. ఇక, రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వసంత రుతువు ఆగమనాన్ని తెలియజేసే విధంగా హోలీని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉల్లాసంగా…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు బ్రదర్ అనిల్, సీనియర్ రాజకీయ నేతలతో పాటు.. క్రిస్టియన్ నేతలు, ఎస్సీ, ఎస్సీ, బీసీ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు.. ఇక, త్వరలోనే వైఎస్ షర్మిల ఏపీలోనూ కొత్త పార్టీ పెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి… తాజాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని చెప్పారు. సీబీఐ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తోందన్న ఆయన.. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, బ్రదర్…
చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు గాను సినీ పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ఈ విషయం మీద కాస్త ఆలస్యంగా స్పందించారు. కొత్త G.Oలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు సినిమాకి సహాయం చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పేర్నినాని గారికి ధన్యవాదాలు. ఈ జీవో సినిమా పరిశ్రమ మళ్లీ…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్లో స్పందించారు. Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు ! “కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేబినెట్.. పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కూడా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఓ సారి పరిశీలిస్తే.. ★ స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్ సోర్సింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం.★ రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను…
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. అయితే, ఈ కేసుపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. వివేకా హత్యపై ఎన్నో నాటకాలాడి కట్టు కథలు అల్లారని మండిపడ్డ ఆయన.. నేనే అవినాష్ రెడ్డిని పిలిపించి రక్తం మరకలు తుడిపించానట అంటూ సెటైర్లు వేశారు.. వివేకాను హత్య చేసిన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగి రెడ్డి సహా చివరికి జగన్ కూడా మన మనిషేనట అంటూ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్‌ను చూస్తే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అనిపించేది.. వాళ్ల నాన్న (వైఎస్ రాజశేఖర్‌రెడ్డి) లేని లోటు తీరుస్తానని చెప్పా… అందుకే గత ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి.. చూడండి.. మళ్లీ అవకాశం రానే వస్తుంది.. మీరు మళ్లీ నిర్ణయం తీసుకోవచ్చునని చెప్పానన్న ఆయన… ప్రజలు వైఎస్ జగన్‌కు మంచి మెజార్టీ ఇచ్చారని తెలిపారు… అయితే, ప్రజల…