రేపల్లె అత్యాచార ఘటన అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య అగ్గి రాజేసింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సైతం వారి వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపక్షంపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. Read Also: Minister Gudivada Amarnath: చంద్రబాబు ఇరుక్కోవడం ఖాయం! పేద ప్రజల కోసం సీఎం…
2024 ఎన్నికలే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో పార్టీ పైనే ప్రధానంగా దృష్టి సారించాలని జగన్ సూచించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ట పరచడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. గడప గడపకు వైసీపీ సర్వే చేస్తుందన్నారు. సర్వేలో రిజల్ట్ బాగా వచ్చినోళ్లకే సీట్లు అని స్పష్టం…
నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. దీంతో.. నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.. కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో…
ఏపీలోని చిత్తూరు జిల్లాలో కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గం కుప్పం. అక్కడ రెవిన్యే డివిజన్ ఏర్పాటు అనంతరం ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రెవిన్యూ డివిజన్ ఏర్పాటుచేశామన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా…రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారు. https://ntvtelugu.com/cm-jagan-launch-new-districts-in-ap/ కుప్పం స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ కావాలని కోరటంతో కుప్పంను రెవెన్యూ డివిజన్ గా…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది.. దీంతో.. ఎవరి పదవి ఊడిపోతుంది..? కేబినెట్లో మిగిలేది ఎవరు? మాజీలు అయ్యేది ఎంత మంది? కొత్తగా పదవి దక్కించుకునేది ఎవరు? ఇలా ఏపీలో అధికార వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.. అయితే, కేబినెట్ నుంచి తప్పించినంత మాత్రాన వాళ్లను పక్కనబెట్టినట్టు కాదు.. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని.. మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. మాజీలు కానున్న మంత్రులతో సీఎం వైఎస్…
మేకపాటి గౌతమ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు.. నేను లేకుంటే గౌతమ్ అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ నెల్లూరు వెళ్లిన ఆయన.. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గౌతమ్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి.. గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడుతూ.. గౌతమ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.. గౌతమ్ మన మధ్య లేడనే…