గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆ శాఖకు సంబంధించిన అధికారులను అభినందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు, గుర్తింపు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఏపీ గనుల శాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ఖనిజ వికాస్ అవార్డు వచ్చింది.. ఇటీవల ఢిల్లీలో మైన్స్ అండ్ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి.. అయితే, ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు మంత్రి పెద్దిరెడ్డి, గనుల శాఖ అధికారులు.. ఖనిజ వికాస్ అవార్డు క్రింద కేంద్ర గనుల శాఖ అందజేసిన రూ. 2.40 కోట్లు ప్రోత్సాహక చెక్‌ను ముఖ్యమంత్రికి చూపించారు.. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అధికారులకు అభినందనలు తెలిపారు.
Read Also: Google halt hiring: గూగుల్ కీలక నిర్ణయం.. హైరింగ్ ప్రక్రియ నిలిపివేత..
కాగా, రాష్ట్ర గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనులశాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ పురస్కారాన్ని అందజేసింది.. రానున్న రెండేళ్లకుగానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద రూ.2.40 కోట్లు ప్రోత్సాహకంగా ఇచ్చింది.. ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మైన్స్ అండ్ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనులు శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.. అయితే, ఖనిజాల మైనింగ్‌పై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర గనుల శాఖ ప్రతీ ఏడాది అవార్డులను ప్రదానం చేస్తోంది. గత రెండేళ్లుగా ఏపీ సర్కార్ 10 రకాల ప్రధాన ఖనిజాలకు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యక్రమాల పర్యవేక్షణలో పారదర్శకంగా వ్యవహరిస్తూ అత్యంత వేగంగా లీజులు జారీ చేయడంతో ఆ అవార్డు వరించింది.