సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు.. అయితే, ఈ కార్యక్రమాన్ని అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు.. గతంలో విజయవాడలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రభుత్వం పటిష్ట చర్యలకు సిద్ధం అవుతోంది.. ఇక, నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో సీఎం సమీక్ష నిర్వహించారు.. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో విజయవాడకు…
నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు.
వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరమన్న ఆయన.. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది.. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నాం అన్నారు.
నేడు రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి బయలదేరనున్నారు. ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి బయలుదేరనున్నారు. ఇవాళ ఆదివారం రాత్రి 9.15 గంటలకు దిల్లీ చేరుకుని, జన్‌పథ్-1లో రాత్రి బస చేయనున్నారు. ఉదయం పది గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆయన చర్చించనున్నారు. దాంతోపాటుగా.. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు ఏపీకి…
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారన్నారు.. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయలేదని.. సెంటిమెంట్ ఉన్నంత వరకు ఆంధ్రావాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించబోరన్నారు.. ఇక, వైఎస్ షర్మిల.. ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా…? తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు..? అని…