గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆ శాఖకు సంబంధించిన అధికారులను అభినందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు, గుర్తింపు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఏపీ గనుల శాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ఖనిజ వికాస్ అవార్డు వచ్చింది.. ఇటీవల ఢిల్లీలో మైన్స్ అండ్…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రం నుంచి వంద శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకే పడ్డాయి. మొత్తం 173 ఎమ్మెల్యేల ఓట్లు ఉండగా... అన్నీ ఒకే అభ్యర్థికి వేసిన రాష్ట్రంగా నిలిచింది ఏపీ.
నవరత్నాలే హామీలుగా అధికారంలోకి వచ్చిన జగన్.. ఆర్థిక కష్టాలు ఉన్నా.. తుచ తప్పకుండా స్కీముల అమలు చేస్తున్నారు. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అభివృద్ధి సంగతేంటనే విమర్శలు వచ్చినా.. బిల్డింగులు కాదు.. మానవాభివృద్ధే అసలు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకున్నారు జగన్. ఏపీ లోటు బడ్జెట్ కు, జగన్ ఇచ్చిన హామీలకు పొంతన లేదన్న అభిప్రాయాల మధ్య జగన్ పాలన మొదలైంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మొత్తం మ్యానిఫెస్టోనూ అమలు చేశామని, చెప్పనివి…
ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్‌ని నియమించటం చట్టవిరుద్ధమని సీపీఐ నారాయణ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గ ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. నిబంధనలు కూడా…
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్ వన్‌గా నిలిచింది.. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ స్పాట్లో నిలిచి సత్తా చాటింది.. ఈ జాబితాలో టాప్ ఎచీవర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించింది కేంద్రం.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. వరుస ట్వీట్లతో చెలరేగిపోతున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. సెటైర్లు వేస్తూ ట్విట్టర్లో మంట పెడుతున్నారు. మరోవైపు, అదే స్థాయిలో టీడీపీ నుంచి సాయిరెడ్డి ట్వీట్లకు కౌంటర్లు కూడా పడుతున్నా.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. ఇక, తన తాజా ట్వీట్లో.. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు…
గతంలో నేతలు పాదయాత్రలు చేస్తే.. వారి తనయులు వారిలాగే పాదయాత్రలకు పూనుకున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ అధినేత, వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019లో ఆయన అధికారం హస్తగతం చేసుకున్నారు. రెండుసార్లు తండ్రితనయులు పాదయాత్రల ద్వారా అత్యున్నత పీఠం అధిరోహించారు. అదే రీతిలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారం పొందారు. చంద్రబాబు బాటలోనే ఆయన…
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్లో సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా…
సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. 175 సీట్లకు ఏకంగా 151 సీట్లలో ఘనవిజయం సాధించి మే 30, 2019న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 22 చోట్ల విజయకేతనాన్ని ఎగుర వేసింది. అంతకుముందు ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు, మూడు లోకసభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా జగన్ ప్రభుత్వం…