ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా.. పర్యాటక శాఖపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశానికి.. ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త కూడా చెప్పబోతున్నారు.. ఎందుకంటే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్లు ప్రారంభంకానున్నాయి.. కరోనా మహమ్మారి…
వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ టాప్లో నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరమన్న ఆయన.. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది.. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నాం అన్నారు.
YSR Netanna Nestam: ఏపీలో మరో పథకం కింద నగదు పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 23వ తేదీన కృష్ణా జిల్లా పెడనలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటికే నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. లబ్ధిదారుల జాబితాలను సచివాలయాలకు పంపించారు. కాగా సొంత మగ్గం…