Pothina Venkata Mahesh Fires On YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జెంట్‌గా జగన్‌ను ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌కి చూపించాలని అన్నారు. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి, జగన్ అసత్యాలు చెప్పారని విమర్శించారు. ఒక భూత వైద్యుడు వేద మంత్రాలు చదివినట్లు, జగన్ కామెంట్లు చేశారన్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులన్న విధంగా జగన్ వ్యవహార శైలి కనిపిస్తోందని మండిపడ్డారు. వైసీపీ నాయకుల మాటల్ని ఎందుకు అదుపులో పెట్టలేదని ప్రశ్నించారు. ఒకప్పుడు అవనిగడ్డ పొలాల్లో పాములు వచ్చేవని.. ఇవాళ జగన్ అనే కట్ల పాము వచ్చి పవన్‌పై విషం చిమ్మిందని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో పవన్‌ను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారని పోతిన వెంకట మహేష్ చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే.. పవన్ కళ్యాన్‌ను చంద్రబాబు, సోము వీర్రాజు కలిశారన్నారు. జగన్‌కు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యలతో అర్థమైందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని అర్థమైందని ఆరోపణలు చేశారు. మీ చంటి, స్వాతిముత్యం నాటకాలను ప్రజలు గుర్తించారని ఎద్దేవా చేశారు. నలభై నెలలుగా మీ నాయకులు మాట్లాడితే తెలియలేదా..? మా అధినేత మాట్లాడిన తరువాతే మీకు నొప్పి తెలిసిందా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ మహిళా నాయకులు సైతం బూతులు తిట్టే పరిస్థితి వచ్చేసిందన్నారు. ఏపీలో తెలుగు భాషను బూతులు భాషగా మార్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ తల్లిని, ఆడవాళ్లను తిట్టినప్పుడు జగన్‌కి కనిపించలేదా? మీ పార్టీలో కామ సూత్ర కమిటీ సభ్యులు కనిపించలేదా..? గోరంట్ల, గంట, అరగంట, బంతి చామంతి అంటే జగన్ రెడ్డి ఏం చేశాడు..? మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ఒక్కసారైనా స్పందించారా..? అంటూ పోతిన వెంకట మహేష్ నిలదీశఆరు. తన తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన ఘనత వైఎస్ జగన్‌ది అని వ్యాఖ్యానించారు.