Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు సుమారు7 గంటల పాటు విచారణ చేశారు. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ED అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని రికార్డ్ చేశారు.. కొన్ని రికార్డ్ చేయకుండా వదిలేశారు.
YS Jagan Padayatra: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అంటే.. వెంటనే పాదయాత్ర గుర్తుకు వస్తుంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి రాగా.. ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి.. అన్ని వర్గాలను కలుస్తూ.. సమావేశాలు, సభలు నిర్వహిస్తూ.. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏపీలో అధికారాన్ని చేపట్టారు.. అయితే, కూటమి అధికారంలోకి…
YS Jagan: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్.. ఎన్టీవీ ఆఫీసులో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. జర్నలిస్టుల అరెస్టులు పత్రికా స్వేచ్ఛకే కాకుండా ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి అని ఖండించారు. పండుగ సమయంలో అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి పోలీసులు తలుపులు పగులగొట్టి ప్రవేశించి, చట్టపరమైన విధి విధానాలు పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం అత్యంత…
YS Jagan: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. యువతకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ ఫైర్ అయ్యారు. యువత లక్ష్యంతో, ఏకాగ్రతతో పనిచేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారు.. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపును మనం స్మరిస్తున్నాం.
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీసులో జరిగిన పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు వర్క్‌షాప్‌లో కీలక సూచనలు చేశారు.. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీని బలమైన సంస్థాగత నిర్మాణంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలి. పార్టీ కమిటీల నియామకాలన్నీ వెంటనే పూర్తిచేయడంలో అనుబంధ విభాగాలు అన్నీ ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు.. కమిటీల నియామకాలన్నీ డిజిటలైజేషన్ జరగాలి..…
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాస్ పార్టీ అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు. రానున్న 45 రోజుల్లో…
రాజధాని అమరావతిపై మరోసారి రచ్చ మొదలైంది.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని నిర్మాణం విషయంలో చేసిన వ్యాఖ్యలు.. వాటికి కూటమి మంత్రులు, నేతలు కౌంటర్ ఇవ్వడంతో.. హాట్ టాపిక్‌గా మారిపోయింది.. మరోవైపు, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. నదీ గర్భం (River Bed)కు, నదీ పరివాహక ప్రాంతం (River Front)కు మధ్య ఉన్న తేడా…
BT Naidu: నీ సలహాల వల్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జల కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదని, అలాంటి వ్యక్తి చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని…
YS Jagan: భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ చేయటం చంద్రబాబు కోసం పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడికి ప్లాన్ చేసిన చంద్రబాబు.. 15 వేల ఎకరాల భూమి కావాలన్నారు..