Vijayasai Reddy: రాష్ట్ర ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యం.. మోడీ సభను రాజకీయం చేయొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy On PM Narendra Modi Vizag Tour: తమ వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే తాము కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని ఎంపీ విజయసాయి రెడ్డీ స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను అభివృద్ధి చేయాలన్నదే వైసీపీ లక్ష్యమని, ఆ ఆలోచనతోనే తాము రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చామని తెలిపారు. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ కోసం ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈనెల 11వ తేదీన ప్రధాని విశాఖకు రానున్నారని, 12న బహిరంగ సభ జగనుందని వెల్లడించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సభ్యులుగా ఉంటారని అన్నారు.
ఏయూలోని రెండు ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో 29 ఎకరాల్లో ప్రధాని మోడీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. క్రీడా అవసరాలకు తగ్గట్టు మైదానాన్ని సిద్ధం చేస్తున్నామని.. ప్రధాని హెలికాప్టర్ కోసం ఏయూ ఇంకుబేషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేపబడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధాని ఏ రాష్ట్రానికి వస్తారో, అయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా సహకరించాల్సి ఉంటుందని.. తామూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ విశాఖ పర్యటనలో భాగంగా మోడీ రూ. 12 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారన్నారు. ఇందులో రాజకీయ కోణాలు చూడకూడదని, అనవసరమైన రాద్ధాంతాలకు తెరలేపొద్దని ప్రతిపక్షాల్ని కోరారు.
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని.. రాజధాని అంశం అమలవ్వడం ఖాయమని విజయసాయి రెడ్డి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా.. విశాఖ రాజధాని కావడాన్ని అడ్డుకోలేరన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో వైసీపీ కట్టుబడి ఉందని, స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన తమ పార్టీ ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. తమ వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!