Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) దాని అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేష్ యాదవ్ చెప్పే ‘‘పీడీపీ’’కి కొత్త అర్థాన్ని యోగి చెప్పారు. పీడీపీ అంటే వెనకబడిని, దళిత, అల్పా సంఖ్యాకులు కాదని ‘‘ప్రొడక్షన్ హౌజ్ ఆఫ్ దంగై, అపరాధి’’( అల్లర్లు, అపరాధాలు చేసే వ్యక్తుల ప్రొడక్షన్ హౌజ్)అని యోగి అన్నారు.
Uttara Pradesh Madrasa Act: ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం 2004పై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. దీంతో యోగి ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని మదర్సా చట్టంపై మంగళవారం (నవంబర్ 5)న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం…
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చిందని, ఇందుకు అయోధ్ నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం హర్యానాలోని పంచకులలో ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు.
Bahraich violence: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో దుర్గాపూజ సమయంలో అల్లర్లకు కారణమై, గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులపై ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు నిందితులు నేపాల్ పారిపోతున్న క్రమంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితులు సర్ఫరాజ్ అలియాస్ రింకు, ఫాహిమ్ నేపాల్‌కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హండా బసెహ్రీ కెనాల్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నిందితుల కాలిలో కాల్చినట్లు తెలిపారు.
Bahraich Violence : రెండు రోజుల హింసాకాండ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో శాంతి నెలకొని ఉంది. అయితే ప్రస్తుతానికి మార్కెట్‌ను మూసి ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. సీఎం యోగి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఉన్నట్లు అర్ధమవుతుంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని నగరాల్లో రాత్రిపూట రోడ్లపై కార్లను పార్క్ చేసే వారిపై ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేయనుంది. మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రిపూట వాహనాలను పార్కింగ్ చేసే వారి నుంచి ప్రభుత్వం పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుంది.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తామని ప్రకటించారు.
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే, వారు దేశాన్ని విభజిస్తారు. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్కి తెలుసు’’ అని అన్నారు.