Yogi Adityanath: ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’ భారీ మతరపరమైన కార్యక్రమం, ఇది ఏ ఒక్క కులం, మతానికి ఉద్దేశించబడలేదని, ఇది అన్ని మతాలు, సంస్కృతులకు, ప్రతీకగా నిలుస్తుందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మ జాతీయ మతం’’ అని అన్నారు. ‘‘సనాతన ధర్మం జాతీయ మతం,
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారిపై యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. కుంభమేళా నేపథ్యంలో చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని, చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారని, అలాగే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన లలూ యాదవ్ సంజీవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు సంజీవ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా…
నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు చేయగా.. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
CM Yogi: భారతదేశంలో అనేక దేవాలయాలు- మసీదుల వివాదాల పునరుద్ధరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..వారసత్వాన్ని తిరిగి పొందడం చెడ్డ విషయం కాదు... ఇప్పుడు సంభాల్‌లోని షాహీ జామా మసీదులో సనాతన్ రుజువు కనిపిస్తుంది అన్నారు.
Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు.
Sambhal: సంభాల్‌కు సంబంధించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది.
Yogi Adityanath: మొఘల్ పాలకుడు ఔరంగజేబు, అతని వారసులను ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఔరంగజేబు వారసులు ఇప్పుడు కలకత్తా సమీపంలో నివసిస్తున్నారని, జీవించడానికి రిక్షాలు నడుపుకుంటూ బతుకుతున్నారని అన్నారు. ‘‘ఇది చరిత్ర యొక్క దైవిక న్యాయం’’గా అభివర్ణించారు. ఔరంగజేబు దైవత్వాన్ని ధిక్కరించి, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలపై విధ్వంసక చర్యలకు పాల్పడ్డాడని చెప్పారు. Read Also: KTR Case: హైకోర్టులో కేటీఆర్…
రామ మందిర నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించారని.. కానీ తాజ్ మహల్ కోసం పనిచేసిన కార్మికుల చేతులు నరికేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మిక శక్తికి ఉన్న గౌరవాన్ని అభినందిస్తూ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) వార్షిక సదస్సులో యూపీ ముఖ్యమంత్రి ప్రసంగించారు.
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ అల్లర్లపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అయోధ్య, ఇప్పుడు సంభాల్, బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సామాజిక విభజనకు పాల్పడే వారు అన్ని చోట్లా ఉన్నారు.