Yogi Adityanath: సంభాల్ అల్లర్లపై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..
- సంభాల్ అల్లర్లపై యూపీ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..
- ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సామాజిక విభజనకు పాల్పడే వారు ఉన్నారు..
- బంగ్లాదేశ్‌లోని హిందూ మైనార్టీలకు రక్షణ కల్పించాలి: యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ అల్లర్లపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అయోధ్య, ఇప్పుడు సంభాల్, బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సామాజిక విభజనకు పాల్పడే వారు అన్ని చోట్లా ఉన్నారు.. వాళ్లతో చాలా ప్రమాదం అన్నారు. సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ రాముడని పేర్కొన్నారు. కులం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించి మన మధ్య ఉన్న ఐక్యతను నీరుగార్చేందుకు.. కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న విపక్ష పార్టీలపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: TGRTC New Logo: రవాణా శాఖ కొత్త లోగో విడుదల.. ఆర్టీసీ విజయాలపై బ్రోచర్
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
అయితే, బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిస్థితులను సైతం ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. అక్కడి మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్‌పై దేశ ద్రోహం నేరారోపణలు మోపి అరెస్టు చేశారని ఆరోపించారు. అక్కడి మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.. సంభాల్‌లో అల్లర్ల వెనుక బీజేపీ ప్రమేయం ఉందంటూ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలనూ ఆదిత్యనాథ్ ఖండించారు.
Read Also: Pushpa 2: ‘పుష్ప 2’ వేయలేదని థియేటర్ పై రాళ్ల దాడి
ఎస్పీ నేతలు సోషలిస్టు సిద్ధాంత కర్త రామ్ మనోహర్ లోహియా గురించి మాట్లాడతారు.. తప్పా, ఆయన భావజాలాన్ని మాత్రం అనుసరించరని యూపీ సీఎం ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఇప్పటి సోషలిస్టులు రాజ వంశీయులు, గూండాలు, నేరస్తుల సపోర్టు లేకుండా ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేరని పేర్కొన్నారు. వాళ్లే లేకపోతే నీటిలో నుంచి తీసేసిన చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటారని యోగి ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!