Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చిందని, ఇందుకు అయోధ్ నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 500 ఏళ్ల తర్వాత దీపావళి రాముడి నివాసంలో జరగుతోందని చెప్పారు. ‘‘500 ఏళ్ల తర్వాత దీపావళికి శ్రీరాముడు తన జన్మస్థలంలో ఉన్నాడు’’ అని అన్నారు.
Read Also: Kandula Durgesh: బాణాసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు ధాటికి ఇద్దరు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు
ఇది ప్రారంభం మాత్రమే అని, 2047 నాటికి దేశ స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి కాశీ, మధుర కూడా అయోధ్యలా ప్రకాశించాలి అని అన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్-జ్ఞాన్వాపి ఆలయ మసీదు వివాదం పరిష్కారం కోసం సుదీర్ఘమైన కోర్టు పోరాటం జరుగుతోంది. మథురలోని కృష్ణ జన్మ భూమి మరియు షాహీ ఈద్గా మసీదు వివాదంపై కూడా ఇదే విధమైన కోర్టు కేసు నడుస్తోంది.
‘‘ గుర్తుంచుకోండి, సీతమ్మకు జరిగిన అగ్ని పరీక్ష పదే పదే జరగకూడు. దీని నుంచి మనం బయటపడాలి. అయోధ్య ప్రజలు మరోసారి ముందుకు రావాలి. ఈ రోజు ఘనమైన వేడకల కోసం మేము ఇక్కడ ఉన్నాం’’ అని సీఎం అన్నారు. మాఫియాల మాదిరిగానే, ఈ అడ్డంకులు కూడా తొలగించబడుతాయి అని అన్నారు. రామ జన్మభూమి ఉద్యమానికి తమ జీవితాలను అంకితం చేసిన ఆత్మీయులందరిని స్మరించుకునే తరుణమిది అని యోగి చెప్పారు.