Sunrisers Leeds: పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలు ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ లీడ్స్ ‘ఎక్స్’ అకౌంట్ సస్పెండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Leeds: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని టీమ్‌లు మ్యాచ్‌లకు సంసిద్ధమవుతున్నాయి. ఈ సారి ఎస్‌ఆర్‌హెచ్ ఎలాగైన కప్పు కొట్టాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీపై అనేక విమర్శలు వచ్చాయి. కావ్యా మారన్‌పై ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే.. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ‘ది హండ్రెడ్’ (The Hundred 2026) ప్లేయర్ల వేలం పాటలో పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుబంధ జట్టు అయిన సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేసింది. అబ్రార్‌ను ఏకంగా 1.90 లక్షల పౌండ్లకు (సుమారు ₹2.34 కోట్లు) దక్కించుకుంది. భారత యాజమాన్యం కలిగిన ఈ జట్టు పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బహిష్కరించాలని.. ఫ్రాంచైజ్, సహ యజమాని కావ్యా మారన్ ఇద్దరూ తీవ్ర విమర్శలకు గురయ్యారు.
READ MORE: Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!
Also Read
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై, యజమాని కావ్యా మారన్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ‘బాయ్‌కాట్ సన్‌రైజర్స్ హైదరాబాద్’ (#BoycottSRH) హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. ఇంతలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వివాదం మధ్య సన్‌రైజర్స్ లీడ్స్ ఖాతా సస్పెన్సన్‌కు గురవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే.. “ఎక్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతా సస్పెండ్ చేయబడింది” అనే సందేశం వినియోగదారులకు కనిపిస్తోంది. ఈ అంశంపై మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ సస్పెన్షన్‌కు, అబ్రార్ అహ్మద్ కొనుగోలుకు గల సంబంధంపై ఎక్స్ యాజమాన్యం సైతం సరైన వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ టాపిక్ కాస్త మరింత హాట్ హాట్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం సన్‌రైజర్స్ యాజమాన్యం (సన్ గ్రూప్) ఇంగ్లాండ్‌లోని ‘ది హండ్రెడ్’ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ (గతంలో నార్తర్న్ సూపర్‌చార్జర్స్) పేరుతో కొత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!