బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. పలు చోట్ల ముస్లింలు తమ నిరసనను తెలియజేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాళ్లు రువ్వడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలను తగలబెట్టడం చేశారు. ముఖ్యంగా ఇటీవల యూపీ కాన్పూర్ లో రాళ్లదాడి చేయగా.. నిన్న ప్రయాగ్ రాజ్ లో కొంతమంది అల్లరి మూకలు రాళ్లదాడి చేశారు. దీంతో పాటు సహరాల్ పూర్ లో…
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో మతకలహాలు, అల్లర్లకు చోటు లేదని ఆయన అన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అల్లర్ల రహిత ఉత్తర్ ప్రదేశ్ గా మారిందని ఆయన అన్నారు. యూపీలో కొత్త ప్రభుత్వం తన కార్యక్రమాలను మొదలుపెట్టిందని.. రెండు నెలలుగా మీరంతా యూపీలో జరుగుతున్న కార్యక్రమాలను చూస్తున్నారని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రామ జన్మభూమి భూమి నిర్మాణం శాంతిపూర్వకంగా మొదలైందని ఆయన అన్నారు. హనుమాన్ జయంతి…
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం, పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతారణాన్ని కల్పించేందుకు యోగీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్మాగారాల్లో నైట్ షిఫ్ట్ లో మహిళలు ఎవరూ పని చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత ఏ మహిళా కార్మికులను పని చేయించుకోవద్దని ఆదేశించింది. మహిళల సొంత అనుమతితోనే పని చేసేలా ప్రభుత్వ సర్క్యులర్ ని…
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మదర్సాల్లో జాతీయగీతం ‘ జన గణ మన’ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గురువారం నుంచి యూపీలోని అన్ని మదర్సాల్లో అమలు చేస్తోంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ మార్చి 24న జరిగిన సమావేశంలో అన్ని మదర్సాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈరోజు నుంచి అన్ని మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పని సరి చేసింది. విద్యార్థులు…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు యోగి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. లక్నోలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. అమిత్ షా సమక్షంలో.. యోగి ఆధిత్యనాథ్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. రెండోసారి యూపీలో విజయం సాధించి… బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు అమిత్ షా. ఇక, తర్వాత గవర్నర్ ఆనంది బెన్ పటేల్‌ను కలిసి…
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ మేరకు ఈనెల 25న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. యోగి ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా విచ్చేయనున్నారు రాజకీయ…
నేడు సాయంత్రి 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది. భవిష్యత్ కార్యచరణపై కూడా సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి నియామకంపై ప్రధాన చర్చ జరుగనుంది. నేడు అమృత్‌సర్‌లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నెల 16న పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు శ్రీశైలంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమల్లికార్జున…
అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఈ ఫలితాలు ఉన్నాయి. అయితే పంజాబ్ లో ఆప్ ఊహించని మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ దాదాపు తుడిచి పెట్టుకుపోవటం ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన విశేషం. ఇప్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దేశ వ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తుంది. ఈ విజయంతో ఆ పార్టీకి జాతీయ హోదా కూడా దక్కుతుంది. దేశంలో…
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ యూపీ, గోవా లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి అవుతాయి. యూపీలో నేడు రెండవ విడతలో 55 స్థానాలకు జరిగే…