ఉత్తరప్రదేశ్లో పెరుగుతున్న పోలీసు ఎన్కౌంటర్ల కారణంగా ప్రాణ భయంతో, మోటార్ సైకిల్ దొంగల ముఠా సభ్యుడు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని మన్సూర్పూర్ పోలీస్ స్టేషన్లో చేతిలో ప్లకార్డు పట్టుకుని లొంగిపోయాడు.
సమాజ్వాదీ పార్టీ అధినేత సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అన్ని అక్రమ నిర్మాణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కార్యక్రమాలను మాఫియా ద్వారా స్వాగతిస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆరోపించారు.
Aligarh Mosque: దేశవ్యాప్తంగా హోలీ పండగ సంబరాలు మొదలయ్యాయి. అయితే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కొన్ని చోట్ల మసీదులను టార్పిలిన్లలో కప్పారు. ముఖ్యంగా చాలా సున్నిత ప్రాంతం అయిన అలీగఢ్ లోని మసీదును టార్పలిన్లతో కప్పారు. హోలీ సమయంలో రంగులు పడకుండా మసీదును కప్పినట్లు నిర్వాహకులు తెలిపారు.
Hathras case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ అత్యాచార ఘటన. దేశ రాజకీయాలన్నీ ఈ ఘటన చుట్టూనే తిరిగాయి. ఇదిలా ఉంటే ఈ కేసు ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2020లో జరిగిన ఈ ఘటనలో నలుగురు నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు విధించగా.. మరో ముగ్గురిని నిర్దోషులుగా గురువారం కోర్టు ప్రకటించింది.
Neha Singh Rathore: ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పాట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ పాడిన పాటపై యూపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాన్పూర్ లో అక్రమ ఇళ్లను తొలగింపు తల్లీకూతుళ్లు మరణానికి కారణం అయింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వాన్ని హేళన చేస్తూ నేహా సింగ్ ‘‘ యూపీ మే కా బా’’ అంటూ ఓ సాంగ్ వీడియోను యూట్యూబ్, ఫేస్…
మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాషాయ దుస్తులు ధరించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
UP CM Yogi Adityanath slams Rahul Gandhi over China remarks: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్-చైనా ఘర్షణలపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ లో భారత జవాన్లను చైనా సైనికులు కొడుతున్నారని రాహుల్ గాంధీ శుక్రవారం కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. భారత సైన్యంపై…
Little Man Marriage: పెళ్లి చేసుకోవాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి సంబంధం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. పెళ్లి కూతురు కోసం తెలిసిన చోటల్లా ఆరా తీశాడు.
దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా "సబ్కా సాత్ సబ్కా వికాస్" ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.