పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పై టీడీపీ నాయకుడు కంచేటి సాయిబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కంచేటి సాయికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు వైసీపీ శ్రేణులు. తమ నాయకుడు పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని కర్రలు చేత పట్టి టీడీపీ నాయకుడు సాయిబాబు ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు.…
చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నాడు.. అధికారికంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తాడట.. అధికారికంలో వచ్చేది లేదు, చచ్చేది లేదుని దుయ్యబట్టారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేతి పై పచ్చబొట్టు వేయిస్తానని అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు…
ఏపీలో సైకో పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాజమండ్రిలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాట ఇవ్వాలని ఎన్టీఆర్ పని చేస్తే, చట్టాలు చేస్తే.. ఈ రోజు వైఎస్ బిడ్డకు సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఏం జగన్ ది అని దుయ్యబట్టారు. ఆడపిల్లల పై దాడులు చేస్తున్న ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా.. ఆడబిడ్డల…
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయనికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఐదవ జాబితా కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టారు. సీఎంఓకు వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, సుచరిత, అన్నాబత్తుని శివ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామి రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రి జోగి రమేష్…
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాను అనో.. ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. కాగా.. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు.. తనమీద ఎందుకు చేయరని పేర్కొన్నారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవీ ఇస్తే అమ్ముడుపోయి.. తనపైనే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ-వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ లో ముగియనుంది. ఈ మూడింటికి మూడు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే.. అందులో ఒక్కటైనా దక్కించుకోవాలని టీడీపీ చూస్తోంది. సీటు గెలుచుకోవడానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
కృష్ణా జిల్లా వైసీపీలో బందరు ఎంపీ సీటు రచ్చ కొనసాగుతుంది. అయితే, బందరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాలని అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను వైసీపీ అధిష్టానం కోరింది. దీనికి అతడు స్పందిస్తూ.. తాను చిన్న వాడిని సరిపోనేమో మరోసారి ఆలోచన చేయాలని వైసీపీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కోరినట్టు సమాచారం.
అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు.
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ యాత్రలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సంక్షేమము, రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదే ఉందని అన్నారు. మంచి జరిగి ఉంటేనే ఓటు వెయ్యమని అడిగే దమ్ము జగన్ కి మాత్రమే ఉందని పేర్కొన్నారు. జగన్ ని…