రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. శాసన సభ, మండలి, సెక్రటేరియట్ , AP హైకోర్టు ఇక్కడ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్వార్టర్లు కూడా నిర్మించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సీడ్ యాక్సెస్ రోడ్లను అభివృద్ధి చేశారు. వైఎస్సార్సీపీ టిక్కెట్‌పై ఎన్నికైన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కోసం…
అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్షాలకు సర్వేపల్లి నియోజకవర్గం అగ్నిపరీక్ష కానుంది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరును టీడీపీ సీరియస్‌గా పరిశీలిస్తుండగా, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మళ్లీ నామినేట్ చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ ఇస్తే మూడోసారి పోటీ చేస్తానన్నారు. కాకాణి తన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 2014లో 5,446, 2019 ఎన్నికల్లో 13,973 మెజారిటీతో రెండుసార్లు గెలిచి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. 2022 ఏప్రిల్‌లో…
ఏపీలో దాదాపు రూ. 600 కోట్ల వ్యయంతో 4 వేల పై చిలుకు ఆలయాలు నిర్మించామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దుర్గ ఆలయం, శ్రీశైలం దేవస్థానంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. శ్రీశైలంలో వసతి కొరత ఉందని.. కొత్తగా 750 గదుల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. 3 స్టార్ వసతులతో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే విధానంలో వసతి నిర్మాణం చేపడుతున్నామన్నారు. అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల తదితర దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి…
చంద్రబాబుపై ఎంపీ నందిగామ సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అన్నారు. అనరాని మాటలు అని ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లడుతున్నారని ఆరోపించారు. తాను పనిచేస్తేనే ఓటు వేయాలని జగన్ చెప్తుంటే.. 40 ఏళ్ల అనుభవం ఉండి పొత్తుల కోసం చంద్రబాబు బీజేపీ వెంట పడుతున్నారని విమర్శించారు. 14 ఏళ్లలో ప్రజలకు చేసిన మంచి పని చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు, పవన్ పై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. చంద్రబాబు, సోనియాగాంధీ అమిత్ షా.. వంటి వారిని ఎన్నిసార్లు కలిసిన జగన్మోహన్ రెడ్డిని తాకలేరని అన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి…
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు.. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి బలముంటే పొత్తుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం ఉండదని ఆరోపించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈనెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు జరిగాయి. 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.
ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలశౌరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం బాలశౌరి విజన్ తనకు నచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అనంతరం సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనని అర్జునుడుగా జగన్ పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. సొంత చెల్లి షర్మిలను ఇష్టం వచ్చినట్లు…
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే నెల్లూరు కోర్టులో బ్యాగు చోరీకి గురైందని తెలిపారు.…