మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎల్లుండి (శనివారం) ఏలూరులో జరిగే సిద్దం సభకు నియోజక వర్గం నుంచి కార్యకర్తలు, నేతలను పంపే పనికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో.. మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని మైలవరం పరిశీలకులు పడమట సురేష్ బాబు సమావేశమయ్యారు. కాగా.. ఎమ్మెల్యే వసంత హైదరాబాద్ లో ఉన్నారు. సిద్ధం కార్యక్రమానికి అందుబాటులో ఉండనని వసంత కృష్ణ పార్టీ పెద్దలకు ఇప్పటికే చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్యే లేకపోవటంతో నియోజకవర్గ బాధ్యతలు కేశినేని నాని, పడమట సురేష్ బాబు తీసుకున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ వీడనున్నారు అనే సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో తాజా ఘటనలతో మరోమారు ఎమ్మెల్యే వసంత వ్యవహారం చర్చగా మారింది.