ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రచారం గురించి ఇప్పుడే పట్టించుకోవటం లేదని, ప్రజలకు పథకాలు అందించే విషయం పైనే ఫోకస్ పెట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఎవరి ఊహకు కూడా అందని విషయమని, గతంలో ఇలాంటివి జరిగాయా? అని ప్రశ్నించారు. సీఎం వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చారని, పారదర్శకంగా పథకాలు అందుతున్నాయన్నారు. 2024 ఎన్నికలకు జనవరి 27 నుంచి భీమిలి నుంచి…
అసంతృప్తితో సీఎం వైఎస్ జగన్ను వదిలిపెట్టి వెళ్లే వారి వల్ల ఆయనకు ఏం నష్టం జరగదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లి.. మా ప్రత్యర్థి చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్కు వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని అందరికీ తెలుసన్నారు. మా ప్రభుత్వం నచ్చక ఆమె మాట్లాడుతుందని, ఎవరైనా ఆమె మాటలు నమ్మతారా? అని ప్రశ్నించారు. భావితరాల కోసం పనిచేసే విజనరీ ఉన్న నాయకుడు సీఎం జగన్ అని, తనకు ఓటేయాలని ధైర్యంగా…
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి శ్రీకాకుళం రాకుండానే లోకేష్ ప్యాకప్ అయిపోయాడని బొత్స అన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని, మరో డెబ్బై రోజుల్లో వారే సరైన సమాదానం చెబుతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం…
Vangalapudi Anitha Slams Minister Roja: వైసీపీ మంత్రి రోజాకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దమ్ముంటే ఏ తప్పు చేయలేదని ఏ గుడిలోనైనా రోజా ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని వంగలపూడి అనిత విమర్శించారు. మంత్రి రోజా అవినీతిని నగరి వైసీపీ నేతలే కథలు కథలుగా చెబుతున్నారన్నారు. జగనన్న బాణం తిరిగి వైసీపీకే గుచ్చుకుంటుందని అనిత…
YCP MLA Jakkampudi Raja Comments on CM YS Jagan: అధిష్టానం ఆదేశిస్తే తాను రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అధిష్టానం నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదని, రాజమండ్రి పార్లమెంట్ టికెట్ కాపులకు ఇవ్వాలని భావిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా తాను పోటీకి సిద్ధం అని జక్కంపూడి రాజా తెలిపారు. నా రాజకీయ భవితవ్యం సీఎం జగన్ చేతుల్లోనే…
మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కరెడ్డి, ఉరుకుంద(ఈరన్న) లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నాగరాజు స్వామి సేవా సంఘం హాల్ నందు జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని పాలకుర్తి తిక్కరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నెముక లాగా ఉన్నారని, బీసీల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పెంచి, బీసీ సబ్ ప్లాన్,…
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సూళ్లూరు పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సంజీవయ్యను పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ పదవులను ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు ఎస్సీలను అవమానించారని, ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని అన్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పథకాల పేరుతో ప్రజలను దగా చేసాడని.. ఈసారి జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఫ్యాన్కు ఉరేసుకున్నట్లేనని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటాపురం, పండ్లపురం గ్రామాల్లో పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి.. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కరెంటు బిల్లులు మూడు రెట్లకు పైగా…
షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాదు ఎవరు వచ్చిన తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయలేరన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్ళేవారని ప్రశ్నించారు. రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నాం.. తమతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామని తెలిపారు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఆమె మాట్లాడితే ఎలా అని దుయ్యబట్టారు.