నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే నెల్లూరు కోర్టులో బ్యాగు చోరీకి గురైందని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించారన్నారు. కోర్టులో చోరీ జరిగిన వెంటనే తనపై దాడి ప్రారంభించారని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
Gudivada Amarnath: జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం..
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చోరీ చేయించానని సోమిరెడ్డి ఆరోపించారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఇది చాలా పెద్ద కేసు అని.. గోవర్ధన్ రెడ్డి తప్పించుకోలేడని సోమిరెడ్డి తీర్పు కూడా ఇచ్చేశారని అన్నారు. కోర్టులో చోరీపై హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది.. తనకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. హైకోర్టు నోటీసు ఇచ్చిన రోజే సీబీఐ విచారణ చేయించాలని తాను కూడా కోరినట్లు తెలిపారు. సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత.. తన దగ్గర ఒకసారి అధికారులు స్టేట్ మెంట్ తీసుకున్నారని చెప్పారు. సోమిరెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారని కాకాణి తెలిపారు.
Neeraj Mittal: ఈ ఏడాది చివరికల్లా 5జీ నెట్వర్క్ అమలు చేస్తాం..
విచారణ తర్వాత అన్ని వివరాలు ఇచ్చా.. గోవర్ధన్ రెడ్డికి శిక్ష తప్పదని.. సోమిరెడ్డి పదేపదే చెప్పారని మంత్రి కాకాణి పేర్కొన్నారు. సీబీఐ అన్ని కోణాల్లో విచారణ జరిపింది.. ఎవరు ఆరోపణలు చేసిన వారి వద్ద వివరాలు తీసుకున్నారని తెలిపారు. 88 మంది సాక్షులను విచారించి వారి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారన్నారు. నిందితులకు సంబంధించి అప్పటి జిల్లా ఎస్పీ ఇచ్చిన వివరాలను కూడా తీసుకున్నారని చెప్పారు. పోలీసులు నిందితులుగా గుర్తించిన వారినే సీబీఐ కూడా నిర్దారించిందని అన్నారు. అన్ని వివరాలను విశ్లేషించిన తర్వాతనే తన పాత్ర లేదని సీబీఐ నిర్ధారించిందని మంత్రి కాకాణి తెలిపారు. కానీ చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలు మాత్రం తనపై నిందలు వేశారని ఆరోపించారు. ఎన్నో బహిరంగ సభల్లో తన గురించి మాట్లాడారని పేర్కొన్నారు.