మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా నా తలరాత రాసింది జగన్మోహన్ రెడ్డి.. ఆయన బంటుగా వైసీపీ విజయం కోసం త్యాగానికి సిద్ధం అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీ తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్దమని తెలిపారు. జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ లో అమర్నాథ్ ఒకడు అని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం అని చెప్పారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభల్లో విజయోత్సవ కళ కనిపిస్తోందని అన్నారు. ఈ విజయోత్సవ స్పందనను దారి మరల్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
BIG Shock: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేయనున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే..
ఐటీ అభివృద్ధి పై రాసిన విషపు రాతలు.. పారిశ్రామిక ప్రగతిపై విషం చిమ్ముతున్నారని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక అభివృద్ధి పై తాము చర్చకు సిద్దమన్నారు. టీడీపీ హయాంలో 30 నుంచి 40 వేల కోట్ల పెట్టుబడులు వస్తే వైసీపీ హయాంలో 90 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ ఒన్ గా నిలిచిందని పేర్కొన్నారు.
IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..!
మరోవైపు.. చంద్రబాబు-పవన్ భేటీపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. పవన్ ఒంటరిగా రెండు సీట్లు ప్రకటించినప్పుడు కాపోడు.. మగోడు అనుకున్నాను.. కానీ 25-30 సీట్లకు జనసేన ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోందని తెలిపారు. అదే జరిగితే జనసేన నాయకులు బాధపడక తప్పదని అన్నారు. జనసేన బలం ఎంతో టీడీపీతో సర్దుబాటుతోనే తేలిపోతుందని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు.