కాంగ్రెస్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డికి మడుగులు ఒత్తి, అయన చనిపోయాక జగన్ పై విరుచుకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తమ ఇంచార్జీ మంత్రిగా ఉండి, కనీసం తన నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు, ఆయనకి తన గురించి ఏమీ తెలుస్తుందని రఘువీరా రెడ్డిపై మండిపడ్డారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాల వేగంగా మారుతున్నాయి. పార్టీలో టికెట్ లభించకపోయినా, సమచిత స్థానం కల్పించలేకపోయినా లీడర్లు పార్టీ మారుస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేసింది. ఈ క్రమంలో పార్టీ నుంచి అలకలు, బుజ్జగింపుల పర్వం మొదలైంది.
టీడీపీపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీ కోసం గతంలో చూసిన భూములు టీడీపీ కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయాయని ఆరోపించారు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకూడదనే దురుద్దేశ్యంతో టీడీపీ నేతలు కావాలనే మళ్లీ మళ్లీ కోర్టుకు వేయించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఒంగోలులో భూములు తీసుకున్నామని.. ఒంగోలులో పట్టాలు ఇవ్వకుంటే పోటీ కూడా చేయనని చెప్పానని బాలినేని తెలిపారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఛాలెంజ్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతాను అంటున్నాడని.. తన వెంట్రుక కూడా పీకలేడని ఆరోపించారు. రామకృష్ణ బాబు అవకాశ వాదని దుయ్యబట్టారు. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేసిన వాడు వెలగపూడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాని అడ్డంగా నరికి చంపి పారిపోయిన వ్యక్తి వెలగపూడి.. అటువంటి రామకృష్ణ బాబు ఇప్పుడు రంగులు మార్చి జనసేన అధినేత ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళుతున్నాడని దుయ్యబట్టారు.…
కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. 'సి' ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని తెలిపారు. సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని దుయ్యబట్టారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటలు తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం పదవులు కోసం అర్రులు చాచే మనస్తత్వం తనది కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగే, భజనలు చేసే మనస్తత్వం తనకు లేదని తెలిపారు. అనిల్ తో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. 2014లో తనను ఎవరు ఓడించారో కూడా తెలుసని పేర్కొన్నారు. ఆ విషయాలు తెలియక అనిల్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని తెలిపారు. టీడీపీ పతనావస్థకు చేరింది... ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు.
విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. రైతులను ఆపి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా.. 11 కోట్ల రైతన్నలకు డీబీటి ద్వారా మోదీ ఇస్తున్నారని…
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. కాగా.. మరోసారి భేటీకి నిర్ణయం తీసుకున్నారు. భేటీకి సంబంధించి తేదీ ఖరారు కాలేదు. ఈ సందర్భంగా మీటింగ్ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏపీజేఏసీ ప్రకటించిన ఆందోళనల గురించి తనకు తెలియదన్నారు. మార్చి నెలాఖరుకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.5 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. మిగతా బకాయిలు జూన్ నెలాఖరు వరకు విడుదలకు హామీ ఇచ్చారు.…
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బాలాయపల్లి ఎంపీపీ పిలిస్తే మండల సమావేశానికి ఎమ్మెల్యే ఆనం వచ్చేస్తాడా? అని ప్రశ్నించారు. ఆనంవి సిగ్గులేని పనులు.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా పిలవని పేరంటాలకు వచ్చేస్తాడని విమర్శించారు. కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ ద్వారా రైతులకు 200 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అనం అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.