ప్రొద్దుటూరు రాజకీయం హీటెక్కుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ.40 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఎండోమెంట్ భూమిలో సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు రోడ్డు వేశాడని దుయ్యబట్టారు. ఎండోమెంట్ భూమిపై ఎమ్మెల్యేకు ఉన్న హక్కు ఏమిటి..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాచమల్లు భూదాహం ప్రజలకు తెలియాలనే నిరసన చేపట్టామని వరదరాజుల రెడ్డి తెలిపారు.
Read Also: Suicide: శ్రీశైలం గౌరీ సదనంలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య..
మరోవైపు.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. నీకు రాజకీయ సమాధి కట్టే వరకు నిద్రపోనని వరదరాజులపై మండిపడ్డారు. భూ దాహంతో సజీవ దహనం చేసిన చరిత్ర నీది అని దుయ్యబట్టారు. ఆ కేసులో నీ కొడుకును, బచ్చల పుల్లయ్య కొడుకును బయటకు పడేసి అమాయకులను బలి చేసింది నువ్వు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకుడిని సజీవ దహనం చేసి ఆస్తులను దోచుకున్న నీచమైన సంస్కృతి నీది అని అన్నారు. వయసులో పెద్దవాడివని ఇంతకాలం ఓపిక పట్టా.. ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదని రాచమల్లు తెలిపారు. నీ రాజకీయ పతనానికి నేటితోనే మొదలు అని అన్నారు. నువ్వు అవినీతి పక్షాన ఉన్నావు.. నా వెంట దేవుడు, ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. నీపై ఎప్పటికైనా ఎన్నటికైనా విజయం నాదే అని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.
Read Also: Arvind Kejriwal: 2024లో బీజేపీ గెలిచినా.. 2029లో ఆ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం..