రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు రాయలసీమలో సముద్రం కన్పిస్తోందన్నారు. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత.. రాయలసీమకు జనసముద్రం వస్తే.. ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోందని అన్నారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అని అన్నారు. ఈ యుద్ధం పేదలకు.. పెత్తందారులకు మధ్య జరగబోతుందని,. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోతుందని తెలిపారు.
IND vs ENG: రాజ్‌కోట్ టెస్ట్‌లో భారత్ ఘనవిజయం.. టెస్ట్ చరిత్రలోనే..!
వేరే రాష్ట్రాల్లో ఉంటూ.. అప్పుడప్పుడు మోసం చేసేందుకు ‘నాన్ రెసిడెన్సీ ఆంధ్రాస్’ మన రాష్ట్రానికి వస్తుంటారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు.. అటువంటి నాన్ రెసిడెన్సీ ఆంధ్రాస్ కు, ఈ గడ్డ మీద పుట్టి, ఇక్కడే మీ మధ్య ఉంటూ మనకు మధ్య ఈ యుద్ధం జరగబోతుందని తెలిపారు. మరోవైపు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన రైతులకు ఏమైనా చేశారా అంటూ దుయ్యబట్టారు. అక్కాచెల్లెమ్మలకు కనీసం ఒక్క పథకమైనా పెట్టారా.. బడికి వెళ్లే విద్యార్థులకు ఏమైనా చేశారా అంటూ మండిపడ్డారు.
Viral Video: ఇనుప కడ్డీల మధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న హంస.. వీడియో వైరల్
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయలేదని.. ఒక్క పథకం తీసుకురాలేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదని విమర్శించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. మీరిచ్చిన మేనిఫెస్టోలో కనీసం మూడు శాతం అమలు చేశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, మోసాలతో మేనిఫెస్టోతో ముందుకువస్తున్నాడన్నారు. బంగారు కడియం ఇస్తామని ఊబిలోకి దింపి మనుషులను తినేసే పులి మాదిరిగా ఎర చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు స్కీమ్ లు అంటాడు.. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేసేందుకు బయల్దేరారని అన్నారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడనే చంద్రబాబు సిద్ధాంతమన్నారు. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చెప్పాలని తెలిపారు.