ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్…
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మండిపడ్డారు. గరం మసాలా లాగ చంద్రబాబు మాటలు ఉన్నాయని విమర్శించారు. బాబు సభకు 4 వేల మంది కూడా రాలేదని, తన పుట్టినరోజుకి మాత్రం 70 వేల మంది వచ్చారన్నారు. పేదవాళ్ల కాళ్లు పట్టుకోవడం తమ సాంప్రదాయం అని, పేదవారి కడుపు కొట్టడం మీ సాంప్రదాయం అని ఫైర్ అయ్యారు. తానే మళ్లీ ఎమ్మేల్యేగా గెలుస్తానని, మంత్రి పదవితో వవస్తానని మధుసూధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.…
Kesineni Nani on Chandrababu Naidu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి పేదలంటే చులకన అని విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. రాజ్యాంగంలో పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా? అని ప్రశ్నించారు. ‘క్యాష్ కొట్టు టికెట్ పట్టు’ అన్నది చంద్రబాబు స్కీమ్ అని ఎద్దేవా చేశారు. తన కోసం, తన కొడుకు కోసం, తన పవర్ కోసం, కేసుల నుండి బయటపడడం కోసం ప్రధాని మోడీ కాళ్లు…
Vanga Geetha on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురంను అప్రతిష్ట పాలు చేసే విధంగా పవన్ మాట్లాడవద్దన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి 25 ఏళ్లుగా తానేం చేశానో ప్రజలకు తెలుసని వంగా గీత పేర్కొన్నారు. 2024 శాసనసభ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వంగా గీతలు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయాలు…
మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నేడు నాలుగు మండలల్లో బైక్ ర్యాలీ, భారీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే వ్యతిరేకత పెరగడంతో మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు సిట్టింగ్ సీటులో వైసీపీ మార్పులు చేసింది. ముత్యాల…
వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు.…
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన CFMSను ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోకి తీసుకుంది.. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే…
మన అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పేద వర్గాలను ఓట్ల కోసమే గత పాలకులు చూశారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడిన ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను 50 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశానని.. అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని…
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. పార్టీల అధ్యక్షులంతా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మే 13న జరుగనున్న ఎన్నికల కోసం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనం మద్ధతు కోరబోతున్నారు.
వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్ది బ్రోకర్, ఆర్ధిక ఉగ్రవాది అని విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు…