ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. సంక్షేమం అనేది నిరంతరాయం.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎందుకు సన్నద్దంగా లేదని అడిగారు. మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి, మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మీ వైఖరి కనపడుతోందని ఆరోపించారు. సమర్ధవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు ఎందుకు రూపొందించుకోలేదని ప్రశ్నించారు.
Read Also: Delhi: ఢిల్లీలో ఘోరం.. ఇద్దరు బాలికలు సజీవదహనం
2019కి పూర్వం అంటే.. వాలంటీర్ వ్యవస్థ లేనప్పడు కూడా ఫించన్లు అందిన విషయాన్ని అధికారులు గుర్తు చేసుకోవాలని పురందేశ్వరి తెలిపారు. డీబీటీ ద్వారా ఫించన్ పంపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేంటని అన్నారు. అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగుల పింఛనుకు బటన్ ఎందుకు నొక్కడంలేదని ప్రశ్నించారు. వాలంటీరే ఎందుకు వారి వద్దకు వెళ్లి ఇవ్వాలి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని తెలిపారు. వాలంటీర్ ద్వారా ఇంటింటికి పంపించే ఫించన్ వెనుక ఏమి ఆశీస్తున్నారో వెల్లడించాలని పురందేశ్వరి పేర్కొన్నారు.
Read Also: Keerthi Suresh : బంఫర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్.. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్..?
ఇదిలా ఉంటే.. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కాగా.. వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 6 లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.