Old Woman Video Goes Viral in Memantha Siddham Bus Yatra: చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండలోను భారీగా జనాలు తరలివచ్చారు. దారిపొడవునా సీఎంకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. అయితే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఓ వృద్ధురాలు ‘జగనన్నే మళ్లీ రావాలి, మాకు జగనన్నే కావాలి’ అంటూ అరుస్తూ కనిపించారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న పింఛను పెంచినందుకు జగనన్నకు పుంగనూరు నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదించారు. పింఛన్లు కావాలంటే.. జగనన్నే మరలా రావాలని నినదించారు. సచివాలయాల చుట్టూ తిరగలేమని తమ గోడు వెళ్లబుచ్చారు. సీఎం మహిళతో మాట్లాడుతుండగా.. ‘జగనన్నకీ జై, మళ్ళీ నువ్వే రావాలి, జగనన్నే మాకు కావాలి, మేము మిమ్మల్ని గెలిపిస్తాము’ అని ఓ వృద్ధురాలు సీఎం పట్ల ఆమెకున్న ప్రేమను కనబరిచారు.
Also Read: CM YS Jagan: నేను విన్నాను, నేను ఉన్నాను.. పెరాలసిస్ బాధితుడికి సీఎం జగన్ భరోసా!
ప్రస్తుతం కల్లూరులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కల్లూరులో సీఎంకు జనంఘనస్వాగతం పలికారు. కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎంను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కల్లూరులో స్థానిక ప్రజల కోరిక మేరకు తన షెడ్యూల్లో లేకున్నా.. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన వెళ్లారు.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/04/WhatsApp-Video-2024-04-03-at-1.03.15-PM.mp4?_=1