మదనపల్లెలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి.. పేదల భవిష్యత్తు కోస జరిగే యుద్ధంలో పాల్గొనడానికి అందరూ సిద్ధంగా ఉండండని తెలిపారు. ఇంటింటికి మంచి చేశాను.. 175కి 175, 25 ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా తగ్గకుండా ప్రజలందరూ గెలిపించాలని సీఎం జగన్ కోరారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చానని పేర్కొ్న్నారు.
99శాతం హామీలు అమలు చేసి ఓటు అడుగుతున్నానని సీఎం జగన్ తెలిపారు. ఐదేళ్ళుగా మంచి పరిపాలనను వైసీపీ ప్రజలకు అందించిందన్నారు. రాష్టంలోని ఇంటిటీకి మంచి జరిగింది.. చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఎవరికి లేదని విమర్శించారు. గుంపులుగా తోడేళ్ళు మాదిరిగా జతకట్టి వస్తున్నారు.. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడుతాడా అని అన్నారు. గతంలో పదిమార్కులు కూడా తెచ్చుకోని వారు పరీక్షలు పాస్ అవుతారా అని విమర్శలు గుప్పించారు. 30 పార్టీలు కలిసి వచ్చినా.. మన పార్టీ కార్యకర్తలు, నేతలు వాలంటీరిలు ఎవరు భయపడరన్నారు.
EC: ఏపీ సహా ఐదు రాష్ట్రాల అధికారులపై వేటు
ఫ్యాన్ కు ఓటు వేస్తేనే పథకాలు అన్ని వస్తాయని సీఎం జగన్ అన్నారు. సీఎంగా జగన్ ఉంటేనే పథకాలు వస్తాయాని అందరికీ చెప్పండని తెలిపారు. మరోవైపు.. పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం.. అ ముఠాకు నాయకుడు చంద్రబాబు అని ఆరోపించారు. మోసాలే అలవాట్లుగా.. అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వారితో ఈ ఎన్నికల్లో మన పోరాటం ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో అరుంధతి సినిమాలో పశుపతిలా చంద్రబాబు బయటకొచ్చారని విమర్శించారు. అరుంధతి సినిమాలో సమాధి నుండి వచ్చిన పశుపతి లాగా ఈ పసుపుపతి సీఎం పదవి కోసం వచ్చాడని దుయ్యబట్టారు. పసుపుపతి ఐదేళ్ల తర్వాత వచ్చి వదల బొమ్మాళీ అంటున్నారు.. కుర్చీ కోసం పసుపుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2014లో కంటే ఎక్కువ హామీలు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు…ఆయనకు మద్దతు పలికే వారి తోకలు కట్ చేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.
మరోవైపు.. తన మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించి చంద్రబాబు అవ్వా, తాతలకు పెన్షన్ రాకుండా చేయించాడని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ తో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి పేదలకు అన్యాయం చేశాడని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు వేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చూట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటు వేస్తే తమ పెన్షన్, పథకాలు అందించిన వాలంటీర్ల రద్దుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లేనని తెలిపారు. పెన్షన్, పథకాలు మీకు నేరుగా ఇంటికి రావాలంటే జగన్ సీఎంగా ఉండాలన్నారు. తాను సీఎంగా ఉంటేనే వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్లు, పథకాలు ఇస్తారని తెలిపారు.
Purandeswari: ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారు..