Chandrababu: పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత బహిరంగ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులందరికీ ఇళ్ల వద్దే నగదు ఇవ్వాలి.. పెన్షన్ పంపిణీలో రెండు విధానాలు సరికావని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు, నాటకాలకు తెర దించాలని కోరారు. లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు. ఆ బాధ్యతను సీఎం జగన్ సక్రమంగా నిర్వహించకుండా.. దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijay Deverakonda: పొగరు, బలుపు అనుకునేవాళ్ళు ఉంటారు.. కానీ 200 కోట్లు కొట్టి చూపిస్తా!
Also Read
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
స్వార్ధ ప్రయోజనాల కోసం ఎప్పుడూ లేని విధంగా, ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. గతేడాది 2022 ఏప్రిల్ 1వ తేదీకి ముందే పింఛన్ల నిధులు బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి 1వ తేదీన పంపిణీ చేశారన్నారు. ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుండి విత్ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యేది కాదని ప్రస్తావించారు. మార్చి 16 నుండి మార్చి 30 మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు విడుదల చేశారు.. పింఛన్ దారులకు ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లు కూడా సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారని పేర్కొన్నారు. నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
Mahua moitra: మహువా మొయిత్రాకు షాక్.. ఈడీ కేసు నమోదు
గత ఎన్నికల సమయంలో బాబాయి హత్యను జగన్‌రెడ్డి రాజకీయ లబ్దికి వాడుకున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసుర రక్త చరిత్ర అని తనపై నిందలేశాడని.. అలాగే నేడు పింఛన్ల పంపిణీ విషయంలో జగన్నాటకం ఆడుతూ పింఛన్‌దారులకు నమ్మక ద్రోహం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి పింఛన్లు ఇళ్ల వద్ద కాకుండా సచివాలయాల్లో పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి మార్చి 28న ఇచ్చిన పత్రికా ప్రకటన సీఎం అనుమతి లేకుండా ఇస్తే, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఎందుకు ఆదేశాలివ్వలేదు? అని అన్నారు. తెలుగుదేశంపై నెపం నెట్టి ఎన్నికల్లో లబ్ది పొందడానికి.. అవ్వా తాతల్ని అవస్థల పాలు చేయడం దుర్మార్గం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన సిబ్బంది లేనందున గ్రామాల్లో లబ్దిదారుల్ని గుర్తించడం కష్టమని, అందరికీ ఇంటి వద్ద పింఛన్ ఇవ్వలేమని ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..