చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కి అందరూ ఓటేయాలని కొందరు ప్రజల ముందుకు వస్తున్నారు.. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి ఎందుకు ప్రజలు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ఒక ఇల్లు ఇచ్చారా.. సెంటు జాగా ఇచ్చారా.? ఓటెందుకు వేయాలన్నారు. నిన్న ఒకటో తేదీ పింఛన్ డబ్బులు సుర్యోదయం కాకముందే ఇచ్చేసేవారు.. పింఛన్ ఎందుకు రాలేదో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాలంటీర్లు పింఛన్ ఇవ్వొద్దని చంద్రబాబు పిటిషన్ పెట్టేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Istanbul: టర్కీలో భారీ అగ్ని ప్రమాదం..29 మంది దుర్మరణం..
పింఛన్ రాక ప్రజలు గోలుమని ఏడుస్తున్నారు.. ఎన్నికల స్టంట్ లో భాగంగానే.. చంద్రబాబు పింఛన్ పంపిణీ ప్రక్రియను ఆపేందుకు ప్రయత్నించాడని దుయ్యబట్టారు. బాబుకి ప్రజలు ముఖ్యమా? ఎన్నికల ముఖ్యమా..? అని ప్రశ్నించారు. బాబు ఎలాగో ఎన్నికల్లో గెలిచేయాలిని తాపత్రయం పడుతున్నాడన్నారు. కానీ.. తాను అలా కాదన్నారు. ఎమ్మెల్యేగా ఉంటే సేవకుడిని, ఎమ్మెల్యేగా లేకపోతే స్నేహితుడిగా ఉంటానని తెలిపారు.
Read Also: Chandrababu: పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత బహిరంగ లేఖ..
ఓటేయక ముందు ఏం చెప్పారో.. మళ్లీ ఓటు అడగటానికి వచ్చేంత వరకూ అదే మాటమీద ఉంటారా అని చంద్రబాబు, పవన్ ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడండి.. కానీ ఓటు వేయకండని అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుకు ఓటేస్తే వారు హైదరాబాద్ లో ఉంటారు.. తాను ఎప్పటికీ మీ మధ్యే ఉంటానని చెప్పారు. అలాంటప్పుడు వారికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.