ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఏపీలో జలయజ్ఞం పేరిట 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు అన్నీ నేనే చేశా అంటాడు.. పోలవరం నాదే అంటారు.. హంద్రీనీవా నాదే అంటారు..
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో) సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై జగన్ ధర్నాకు పిలుపునిచ్చారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ రెడ్డిదే అని, సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారని…
ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల…
దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీ అలవాటుగా చేసుకుందని, వైఎస్ జగన్ పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కేసులు పెరిగిపోయాయని, ఈ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపును తాము మౌనంగా భరిస్తున్నాం అని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారి సమస్యలు పరిష్కరించాలని…
కూటమి ప్రభుత్వం విద్యత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 27 నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గం వారీగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని, ప్రజలను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాన్ని వియవంతం చెయ్యాలని కార్యకర్తలను కోరారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనిపించలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అబద్దాలని ప్రజలకు వివరిస్తాం అని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి మరీ దారణంగా ఉందని, రైతులను నిర్లక్ష్యం చేస్తే…
నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు. 24 షెడ్యూల్: వైఎస్ జగన్ మంగళవారం ఉదయం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం (డిసెంబర్ 24) నుంచి నాలుగు రోజుల పాటు (డిసెంబర్ 27) సొంత నియోజవర్గంలో జగన్ పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని.. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోతారు. 24…
కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెబితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అని, తాను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదలేసి వెళ్లాలని హెచ్చరించారు. వైసీపీ వారు లబ్ధి చేకూర్చే అన్నింటిని విడిచి పెట్టాలని, లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్…
వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి ఆనంద్ రాజీనామా చేశారు. ఆనంద్తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఆనంద్ తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆనంద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ కార్యకలాపాలకు ఆడారి ఆనంద్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి,…