TJR Sudhakar Babu: చిన్న చిన్న కారణాలతో ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామనటం దుర్మార్గం..
- అధికార పార్టీపై విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్యే
- 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్న టీజేఆర్ సుధాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు గత పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన చరిత్ర లేదని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.. గత వైసీపీ హయంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు.. జగన్ పేదల ఇళ్ల స్థలాల కోసం 15 వేల కోట్లతో భూములు కొనుగోలు చేశారన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పేదల స్థలాల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు.. ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూములను రద్దు చేసి మరోసారి పంపిణీ చేసేందుకు సిద్ధం కావటం దారుణమని విమర్శించారు.. చిన్న చిన్న కారణాలతో ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామనటం దుర్మార్గమని మండిపడ్డారు..
READ MORE: Thaman : మీ మాటలు జీవితాంతం గుర్తు ఉంటాయి.. చిరు ట్వీట్‌కు తమన్ రిప్లై
Also Read
జగనన్న కాలనీలపై నాడు విమర్శలు గుప్పించి.. నేడు అదే స్థలాలు పంపిణీ చేస్తామంటున్నారని టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు.. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారన్నారు.. జగన్.. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు సర్వ హక్కులు ఇచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం..పేదలను భయ బ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు పేదలకు మంచి చేయాలనుకుంటే కొత్త భూములు కొని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.. సచివాలయ ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు..
READ MORE: Donald Trump: ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత రోజే “ఇమ్మిగ్రేషన్” దాడి ప్రారంభం..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?